ఈ ఫోటోలు, వీడియోలు చూస్తే.. జగనన్నకు నిద్రపట్టదేమో? ఇక కాస్కో...
Publish Date:Jan 20, 2022
Advertisement
జగనన్నపై ప్రజా వ్యతిరేకత మామూలుగా లేదు. రెండున్నరేళ్లుగా ఆవేశం అణిచిపెట్టుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై లోలోనే రగిలిపోతున్నారు. కరోనా కారణంగా రోడ్డెక్కి ఉద్యమించలేకపోతున్నారు కానీ.. లేదంటేనా జగన్‌రెడ్డికి జనాల సెగ తీవ్ర స్థాయిలో తాకుండేది. సాధారణ ప్రజల్లానే ఉద్యోగులూ వైసీపీ ప్రభుత్వంపై విసిగెత్తిపోయారు. గద్దెనెక్కగానే సీపీఎస్ రద్దు చేస్తానన్న జగనన్న.. అప్పటి నుంచీ ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం.. మంచి పీఆర్సీ ప్రకటించి.. జీతాలైనా పెంచుతారనుకుంటే.. అదీ లేదు. తమ చేతినే.. తమ నెత్తి మీద పెట్టి భష్మం చేసినంత పని చేశారు. పీఆర్సీ ఇస్తే జీతం పెరగాల్సింది పోయి తగ్గడాన్ని ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. హెచ్ఆర్ఏలో కోతేసి.. డీఏలతో కవర్ చేసి.. ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. పీఆర్సీపై ఉద్యోగులు ఎంతగా ఆవేశంతో ఉన్నారో తెలీయాలంటే.. ఓసారి ఈ ఫోటోలు చూడాల్సిందే.... వీళ్లెవరూ పేటీఎం బ్యాచ్‌లు కాదు.. ఏ ఐదువందలో, బిర్యానీ ప్యాకెటో, క్వార్టర్ బాటిలో ఇచ్చి.. బస్సుల్లో తీసుకొచ్చిన వారు కానే కాదు. అంతా స్వచ్చందంగా తరలివచ్చారు. జగన్ సర్కారుపై దండయాత్రకు కదలివచ్చారు. వీళ్లంతా ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే. ఇంకా, మిగతా శాఖల ఉద్యోగులు రంగంలోకి దిగలేదు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు.. కడుపు కోతతో ఇలా కోపోద్రోక్తులు అయ్యారు. ఏపీ వ్యాప్తంగా.. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా.. కలెక్టరేట్ ముట్టడితో రచ్చ రచ్చ చేశారు. పదులు..ఇరవైల మాటేలేదు.. ఎక్కడ చూసినా వందల సంఖ్యల్లో ఉద్యోగులు.. పీఆర్సీ జీవోలు రద్దు కోసం ఇలా రోడ్డెక్కారు.. గృహనిర్బంధాలు వారిని అడ్డుకోలేకపోయాయి. పోలీసు ఆంక్షలు, ముళ్ల తీగలు వారిని కట్టడి చేయలేకపోయాయి. ఏపీలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు ఇలా ఉద్యోగుల ముట్టడితో వణికిపోయాయి. పీఆర్సీ నినాదాలతో మారిమోగిపోయాయి. ఆ సౌండ్.. తాడేపల్లి ప్యాలెస్‌లో రీసౌండ్‌గా వినిపిస్తోంది. ఉద్యోగుల నుంచి ఇంతటి వ్యతిరేకతను జగన్ ఊహించి ఉండరు. ఉద్యోగులే కదా.. ఇచ్చింది తీసుకొని.. పడుంటారు అనుకున్నారేమో. తామేం ముష్టివాళ్లం కాదని.. జగన్ వేసే ముష్టి మాకేమీ వద్దని.. పాత జీతమే ముద్దని.. ఇలా తెగించి.. తెగబడుతున్నారు. జీతాలు పెంచకపోతే.. అడ్డగోలు పీఆర్సీ జీవోలు రద్దు చేయకపోతే.. జగన్‌ను గద్దె దింపే వరకూ.. ఈ ఉద్యమ సెగ చల్లారేది లేదంటూ హెచ్చరిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను చాలా బాగా చూసుకుంది. తెలంగాణతో సమానంగా 43శాతం పీఆర్సీ ప్రకటించి ఆశ్చర్యపరిచింది. హెచ్ఆర్ఏ దండిగా ఇచ్చి.. ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు చేసి.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. ఒక్కఛాన్స్ అంటూ.. సీపీఎస్ రద్దు చేస్తానంటూ.. మాయమాటలు చెప్పి.. ఉద్యోగులను మభ్యపెట్టి.. అందలమెక్కారు జగన్. ఆ తర్వాత సీపీఎస్ రద్దు మాటే ఎత్తడం లేదు. జగన్ అవగాహనా రాహిత్యమంటూ సజ్జల కవర్ చేసుకొచ్చాడు. ఇప్పుడు పీఆర్సీతో జీతాలు తగ్గించి.. దారుణంగా అవమానించారు. కించపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులంటే చీప్‌గా చూస్తున్న జగనన్నకు.. గట్టి బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు దండు కట్టారు. కలెక్టరేట్ల ముట్టడితో ఆరంభం పలికారు. అసలైన కార్యచరణ.. ముందుంది అంటున్నారు. జగన్‌రెడ్డి.. ఇక కాస్తో.. ఉద్యోగుల తఢాకా చూస్కో.. అంటూ సవాల్ విసురుతున్నారు.
వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి-- https://www.youtube.com/watch?v=7mjlApylUtA
http://www.teluguone.com/news/content/govt-employees-attack-on-jagan-govt-39-130457.html





