భార్యాభర్తలు ఈ అలవాట్లు వదిలేస్తే.. గొడవలనేవే ఉండవు..!

Publish Date:Aug 21, 2026

Advertisement

ప్రతి వ్యక్తి జీవితంలో భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది.  ఒక వయసుకు వచ్చాక ముడిపడే ఈ బంధం మరణం వరకు తోడు ఉంటుంది. అయితే.. నేటికాలంలో చాలామంది బార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత కంటే గొడవలే ఎక్కువ ఉంటున్నాయి.  ఈ గొడవలే చాలామంది విడిపోవడానికి కూడా దారితీస్తాయి.  భార్యాభర్తల మధ్య అసలు గొడవలు లేకపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.  కానీ.. ఒకే కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ల మధ్య కూడా గొడవలు అనేవి సహజంగానే ఉంటాయి. అసలు గొడవలే లేకుండా ఉండే బంధం ఏదీ ఉండదు. కానీ వీలైనంత వరకు గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరి మీదా ఉంటుంది. భార్యాభర్తలు కొన్ని అలవాట్లు వదిలేస్తే.. వారి బంధంలో చాలా వరకు గొడవలు తగ్గుతాయి.  ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..

పరస్పర అగౌరవం, బాధపెట్టేలా మాట్లాడటం..

 భార్యాభర్తల సంబంధానికి పునాది పరస్పర గౌరవం. , భార్యాభర్తలు చిన్న విషయాలకే ఒకరినొకరు అవమానించుకున్నా లేదా కఠినమైన మాటలు మాట్లాడినా, ఆ ఇంటిలోని పాజిటివ్ ఎనర్జీ  నశిస్తుంది. రోజూ దూషణలు లేదా అవమానకరమైన మాటలు వాడే ఇంట్లో శాంతి ఎప్పటికీ ఉండదు, పైగా పేదరికం  మొదలవుతుంది.

దుబారా ఖర్చు..

 ఒక కుటుంబం  ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి సరైన ఆర్థిక నిర్వహణే కీలకం. భార్యాభర్తలలో ఎవరికైనా తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటు ఉన్నా లేదా డబ్బును విచక్షణారహితంగా దుబారా చేసినా, ఆ కుటుంబం త్వరగా పేదరికంలోకి జారిపోతుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు అనవసరమైన ఆర్భాటం, దుబారా ఖర్చులే అతి పెద్ద కారణాలు.

రహస్యాలు,  అపనమ్మకం..

ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే..  నమ్మకమే ప్రాథమిక విషయం. భార్యాభర్తలలో ఎవరైనా ఒకరికొకరు ముఖ్యమైన విషయాలను దాచడం మొదలుపెట్టినప్పుడు లేదా మోసానికి పాల్పడినప్పుడు, ఆ సంబంధంలో అనుమానం, విద్వేషం చోటుచేసుకుంటాయి. పారదర్శకత లేనిచోట  గొడవలు ఎక్కువ ఉంటాయి.  అటువంటి అల్లకల్లోల వాతావరణం మనిషి  సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

సోమరితనం..

 సోమరులకు , అపరిశుభ్రంగా జీవించేవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు. భార్యాభర్తలు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేచినా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోయినా, లేదా వారే అపరిశుభ్రంగా ఉన్నా, ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. సోమరితనం సమయం , డబ్బు రెండింటి నష్టానికి దారితీసి, పేదరికానికి కారణం అవుతుంది. తద్వారా వారి మధ్య గొడవలు కూడా పెరుగుతాయి.

ఇంటి విషయాలు బయటపెట్టడం..

 ఇంటి విషయాలు ఎల్లప్పుడూ కుటుంబంలోనే ఉండాలి. తమ పరస్పర వివాదాలు, వ్యక్తిగత బలహీనతలు లేదా కుటుంబ రహస్యాలను ఇతరులకు వెల్లడించే భార్యాభర్తలు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. బయటి వ్యక్తులు దీనిని అవకాశంగా తీసుకుని, విభేదాలను మరింత పెంచుతారు. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఇతరుల సలహాలు తీసుకోవాలంటే, ముందుగా సమస్యలను అందరికీ చెప్పకుండా గోప్యత  పాటించడం ముఖ్యం.  ఒకరికొకరు రక్షణ కవచంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సంక్షోభసమయాల్లో ఓర్పు వహించడం, , కుటుంబంలోని పూజలు, వ్రతాలు వంటివి కలిసి ఆచరించడం, మర్యాదను కాపాడుకోవడం ముఖ్యం.

                                                                                                                                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం జీవితాంతం కలిసి నడవాల్సిన అనుబంధం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉంటే ఈ బంధం ఎంతో ఆనందంగా ఉంటుంది.
మోకాలి నొప్పి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది గాయం వల్ల లేదా ఆర్థరైటిస్, గౌట్ , ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యల వల్ల కూడా  సంభవించవచ్చు.
అవమానం, బాధ.. ఇవి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కునేవే.  నిజానికి చాలామంది అవమానం, బాధ అనేవి బాగా దగ్గరైన, ఎంతో ఇష్టపడిన వారి కారణంగానే అనుభవిస్తూ ఉంటారు.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది..
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది.
నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.