ప్రేమకు, అనుబందానికి మధ్య తేడా ఏమిటి.!

Publish Date:Aug 13, 2026

Advertisement


నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు. అయితే.. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య గల తేడా గురించి మాత్రమే కాకుండా..  ప్రేమకు  అనుబంధానికి మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?  వివరంగా తెలుసుకుంటే..

నిజమైన ప్రేమ, ఆకర్షణ..అనుబంధం..

ఒకరితో కలిసి ఉంటే సంతోషంగా ఉండటం ప్రేమ కావచ్చు, కానీ వారు లేకుండా అశాంతిగా ఉండటం ఎల్లప్పుడూ ప్రేమ కాదని అంటున్నారు. చాలాసార్లు  బంధాలలో  ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకుంటున్నారనే ఫీలింగ్ ఎంత డీప్ గా ఉంటుందంటే..  ప్రేమలో ఉన్నామో లేక ఎదుటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో,  లేదా లోతుగా అనుబంధంలో ఉన్నారో  కూడా    తెలియనంతగా ఉంటుంది. ప్రేమ మనసును విశాలం చేస్తుంది, అయితే అనుబంధం  నెమ్మదిగా మనసును బంధిస్తుంది.

ప్రేమలో స్వేచ్ఛ, అనుబంధంలో  సొంతమనే బావన ఉంటుంది..

నిజమైన ప్రేమ  వ్యక్తిని తన కోరికలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించదు. అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను, భావాలను , స్వేచ్ఛను గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అనుబంధం ఎక్కువగా ఉంటే మాత్రమే ఉంటే  ఎదుటి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికల ప్రకారమే ప్రవర్తించాలనే వాంఛను బలపరుస్తుంది. ఇది స్వార్థం కూడా కావచ్చు.

నమ్మకం ఉన్నచోట.. భయం ఉండదు..

 సంబంధంలో నిజమైన ప్రేమ ఉంటే, దూరం ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా నమ్మకం నిలిచి ఉంటుంది. అయితే, అనుబంధం ఎక్కువగా ఉంటే..  కాలంతో పాటు అవతలి వ్యక్తి తమను విడిచిపెడతారేమోనని పదేపదే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చేసే ఫోన్ కాల్స్, అరుదుగా , లేదా ఒంటరిగా సమయం గడపడం వంటివి కూడా ఆందోళనకు కారణం కావచ్చు. అందుకే మనసు స్థిరంగా ఉండాలి.

ప్రేమలో సాన్నిహిత్యం ఉంటే.. అనుబంధం  కోల్పోతామేమో అనే భావన ఉంటుంది..

ఒకరిని మన సొంతవారిగా భావించడం సహజం. ఆ సొంతమనే భావనే భయంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. ఆ వ్యక్తి లేకుండా మన జీవితం అసంపూర్ణంగా ఉందని, మన సంతోషం పోతుందని, లేదా మనల్ని మనం చూసుకోలేమని అనిపించడం మొదలైనప్పుడు, ఈ భావన ప్రేమను దాటి అనుబంధంగా డెవలప్  చెందుతుంది.

అంచనాలు ఉంటే బంధం బలహీనమవుతుంది..

బంధంలో అంచనాలు ఉన్నప్పుడు ఆ బంధం బలహీనంగా మారుతుందట. అంచనాలు ఉన్నప్పుడు ఆ అంచనాలను చేరుకోలేక పోవడం వల్ల  డిజప్పాయింట్ కావడం జరుగుతుంది.  ఇది బంధంలో ఉన్న మనిషి మీద కూడా అభిప్రాయం మారేలా చేస్తుంది. గొడవలు,  వాగ్వాదాలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రేమ కోసం  తమను తాము కోల్పోతే..

చాలామంది ప్రేమ కోసం తమను తాము కోల్పోతారు.  ఇలా చేయడం వల్ల ప్రేమించిన వ్యక్తి మీద ఆధారపడినట్టు అవుతుంది.  ఆ వ్యక్తి ఏదైనా అన్నా లేదా దూరమైనా.. ఆ సమయంలో జీవితం మొత్తం శూన్యమైనట్టు అనిపిస్తుంది. అంతే కాదు..  చూసుకోవడానికి  తమకంటూ ఏమీ మిగలకుండా అయినట్టు అనిపిస్తుంది.  

                                                                                                                                           *రూపశ్రీ.

 

By
en-us Political News

  
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.