మనిషనే వాడున్నాడా!

Publish Date:Dec 15, 2016

Advertisement

 

పాపం ఆ పాప పార్కులో ఒంటరిగా దీనంగా కూర్చుని ఉంది. తన చుట్టూ ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఎందరో పెద్దలు కబుర్లు చెప్పుకొంటున్నారు. కానీ ఎవరూ ఆమెని అంతగా పట్టించుకోవడం లేదు. తమతో ఆడుకోమని పిల్లలు అడగడం లేదు. ‘దీనంగా ఉన్నావేంటి తల్లీ!’ అని పెద్దలూ విచారించడం లేదు. కారణం! ఆ పాపని చూడగానే తనో పేదరాలు అని తెలిసిపోతోంది. దానికి తోడు ఆమెని నిరంతరం వెక్కిరించే నీడలా, వీపు మీద పొడుచుకువచ్చిన గూని ఒకటి.

 

పిల్ల అలాగే దీనంగా కూర్చుని ఉంది. గంట.... రెండు గంటలు... మూడు గంటలు... మధ్యాహ్నం... ఎవరూ ఆ పిల్లని పెద్దగా గమనించినట్లుగా లేదు. ఒకవేళ చూసినా చూడనట్లు సాగిపోతున్నారేమో! అసలే పేదతనంతో చిరిగిన బట్టలు, ఆపై గూని... ఆ పాపని పలకిరించే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదేమో! కనీసం ‘అన్నం తిన్నావా?’ అని కూడా ఆ చిట్టి తల్లిని అడగాలని ఎవరికీ తోచలేదు.

 

సాయంత్రం అయ్యింది. పాప అలాగే కూర్చుని ఉంది. ఇంతలో ఒక యువకుడు నిదానంగా ఆ పాప వైపుగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ‘చాలాసేపటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి? నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లున్నావు. ఏంటి విషయం?’ అంటూ అడిగాడు.

 

తనని ఎవరో అజ్ఞాతవ్యక్తి పలకరించేసరికి ఆ పాప ఒక్కసారిగా కంగారుపడిపోయింది. ‘ఏం లేదు.. ఏం లేదు,’ అంటూ తడబడింది. కానీ ఆ మనిషి ఊరుకునేలా లేడు. నిదానంగా పాపని మాటల్లోకి దింపి ఆమె కుటుంబం గురించీ, ఆర్థిక సమస్యల గురించీ, చదువు గురించీ తెలుసుకున్నాడు. మాటల్లో పడి రాత్రివేళ కావడాన్ని వాళ్లిద్దరూ గమనించనేలేదు. తన చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా కంగారుపడ్డాడు. ‘చూడూ! ఇంత రాత్రివేళ నువ్వు ఇలాంటి చోట ఉండటం అంత మంచిది కాదు. మీ ఇంటికి వెళ్లిపో!’ అంటూ ఆమెని సాగనంపాడు. పార్కు గేటుదాకా ఆమెకి తోడు వచ్చి చేతిలో ఓ వందరూపాయల కాగితాన్ని పెట్టాడు. అతని ప్రవర్తన చూసి పాప కళ్లలో నీళ్లు తిరిగాయి.

 

‘నా అవతారాన్ని చూసి, అవకరాన్ని చూసీ జోలికి వచ్చేందుకు కూడా భయపడిపోతారు. మరి మీకెందుకు నన్ను పలకరించాలని అనిపించింది,’ అంటూ కన్నీటితో అడిగింది. దానికి ఆ యువకుడు చిరునవ్వుతో ‘నా దృష్టిలో నువ్వు ఒక దేవతవి. మనుషుల మనసులో ఇంకా జాలి ఉందో లేదో గమనించడానికి వచ్చిన దేవదూతవి. మనిషి అన్న మాటలో మానవత్వం మిగిలుందో లేదో పరీక్షించేందుకు వచ్చిన చిట్టి తల్లివి. నీలాంటి వారిని పట్టించుకోకపోతే సమాజం అన్న మాటకు విలువ లేదు,’ అంటూ వెళ్లిపోయాడు. తనని వీడి వెళ్లిపోతున్న ఆ యువకుడిని చూసిన ఆ పాప మొహంలో ఓ చిరునవ్వు విరిసింది. నిజంగానే ఆమె దేవదూతేనేమో!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.

By
en-us Political News

  
గుండె జబ్బులు ఉన్నవారికి స్టెంట్‌లు లేదా బైపాస్ సర్జరీలు నిజంగా ప్రాణాలను కాపాడుతాయా? 25 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు మరియు వైద్య నిపుణుల హెచ్చరికల పూర్తి సమాచారం.
రోజూ ఒక గ్లాసు బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు బీపీ నియంత్రణ, కిడ్నీల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ సంబంధాలలో ఒకరికొకరు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో, ఎవరి వ్యక్తిగత జీవితానికి వారు కొంత వ్యక్తిగత సమయం లేదా స్పేస్ తీసుకోవడం కూడా అంతే అవసరం.
మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు.
చలికాలంలో క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం నివారణ, బరువు నియంత్రణ మరియు ఇమ్యూనిటీ పెంచడంలో క్యాప్సికమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా నల్ల శెనగ గుగ్గిళ్లు తింటే కేజీ మటన్, పాలు తాగిన దానికంటే ఎక్కువ శక్తి లభిస్తుంది. నల్ల శెనగల్లోని పోషకాలు, కేలరీలు మరియు ఆరోగ్య లాభాల గురించి పూర్తిగా తెలుసుకోండి.
కంటిచూపును సహజంగా మెరుగుపరచుకోవడానికి, కళ్ళద్దాలను వదిలించుకోవడానికి మునగాకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా సహాయపడతాయో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా తినుటకు అనువైన క్రిస్పీ క్యాప్సికం బజ్జీల తయారీ విధానం మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పచ్చిబొప్పాయి తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? జీర్ణక్రియ మెరుగుదల, బరువు తగ్గడం, చర్మ సంరక్షణ మరియు కంటి చూపు వంటి అసాధారణ లాభాల గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే పల్మనరీ ఎంబాలిజం లక్షణాలు, కారణాలు, ప్రాణాపాయ ప్రమాదం మరియు నివారణ మార్గాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
మీ టూత్‌బ్రశ్‌ను ఎంతకాలం వాడాలి? దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రశ్‌ను ఎప్పుడు మార్చాలి? టూత్‌బ్రశ్ మార్చాల్సిన సరైన సమయం మరియు ఓరల్ హెల్త్ చిట్కాల పూర్తి సమాచారం కోసం ఇది చదవండి.
పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? కోడి మాంసం కంటే 6 రెట్లు ఎక్కువ శక్తిని, హై ప్రోటీన్‌ను అందించే పుచ్చ గింజల అద్భుత ఆరోగ్య లాభాలు, పోషక విలువలు మరియు తినే సరైన పద్ధతి గురించి తెలుసుకోండి.
పర్‌ఫెక్ట్ చాయ్ తయారీకి సరైన విధానం ఏంటి? టీ చేసేటప్పుడు 90 శాతం మంది చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకోండి. అల్లం, పాలు, టీపొడి వేసే సరైన క్రమంతో హోటల్ స్టైల్ కడక్ టీ చేసే ఈజీ టిప్స్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.