కుటుంబంలో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం ఎలా.!

Publish Date:Oct 13, 2026

Advertisement

ఇంట్లో కుటుంబ సభ్యులు మన ప్రతి చిన్న విషయంలోనూ తలదూర్చడం లేదా ప్రతిదానికీ అతిగా సలహాలు ఇవ్వడం వల్ల ఎంతోమంది మానసిక ప్రశాంతతని కోల్పోతుంటారు. ప్రేమతో చెప్పే విషయాలైనా కొన్నిసార్లు అది  వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డుగా మారుతుంది. అయితే ఈ సమస్యను గొడవలు పడకుండా, పెద్దల మనసు నొచ్చకుండా  పరిష్కరించుకోవాలి . అందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే...

గోప్యత..

మన జీవితంలో కొన్ని విషయాలు పూర్తిగా మన వ్యక్తిగతమైనవి. ఉద్యోగం, ఆర్థిక విషయాలు, జీవన శైలి లేదా మన రోజువారీ నిర్ణయాలు అన్నీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలని లేదు. అవసరం లేని విషయాలను ఇంట్లో వాళ్ళతో ప్రస్తావించకుండా ఉండటమే చాలాసార్లు గొడవలకు దూరంగా ఉండేలా చేస్తుంది. మీ వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించడం నేర్చుకుంటే చాలా వరకు అనవసర జోక్యం తగ్గుతుంది.

అర్థమయ్యేలా చెప్పడం..

ఒకవేళ కుటుంబ సభ్యులు ఏదైనా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటుంటే, వారికి మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా, ప్రేమగా తెలియజేయాలి. మీ నిర్ణయాలను మీరే స్వయంగా తీసుకునే వయసులో ఉన్నామని, ఒకవేళ తప్పు జరిగితే దాని నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వమని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి.  కోపంతో అరుచుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది కానీ పరిష్కారం దొరకదు.

మంచి చెబితే వినాలి..

కొన్నిసార్లు కుటుంబ సభ్యులు మన మేలు కోరి మాత్రమే సలహాలు ఇస్తుంటారు. అలాంటప్పుడు వారి ఉద్దేశం మంచిదేనని గుర్తించి వాళ్ళని పూర్తిగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారి సలహాలను విన్నట్లుగా నటించి, ఆ తర్వాత మీ మనసుకు ఏది సరైనదనిపిస్తే అదే చేయడం మంచిది. దీనివల్ల వారిపై మీకు గౌరవం ఉన్నట్లుంటుంది,  అదే సమయంలో మీ నిర్ణయం మీదే నిలబడవచ్చు. 

లిమిట్స్..

మన జీవితంలో కొన్ని హద్దులను మనమే స్పష్టంగా గీయాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మన విషయాలను పంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. మీ వ్యక్తిగత స్థలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ ప్రశాంతంగా మాట్లాడుతూ, మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేస్తే కాలక్రమేణా వారు కూడా మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభిస్తారు.

                                                                                                                            *రూపశ్రీ.

By
en-us Political News

  
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
మధుమేహం మరియు ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఊరటనిస్తూ, మందులు లేకుండానే రక్తంలోని చక్కెరను నియంత్రించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ గురించి తెలుసుకోండి. స్విస్ పరిశోధకుల ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ విశేషాలు.
గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులలో ఆరోగ్యానికి ఏది మంచిది? బరువు నియంత్రణ, డయాబెటిస్, ఎముకల బలం కోసం ఏ రొట్టె ఉత్తమమో పూర్తి పోషక విశ్లేషణ తెలుసుకోండి.
మార్కెట్ నుంచి ఎండిన బిర్యానీ ఆకులు కొనడం ఆపేయండి! కేవలం రూ.200 పెట్టుబడితో మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే గుమగుమలాడే బిర్యానీ ఆకు మొక్కను ఎలా సులభంగా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారపు అలవాట్లు, నీరు త్రాగే విధానం, వ్యాయామం మరియు నిద్రకు సంబంధించిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
నిద్రలేమి సమస్యను తగ్గించే పోషకాలు, పిప్పి పన్ను నొప్పికి తేనెతో ఇంటి చిట్కాలు మరియు 70% పచ్చి ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఫ్రాన్స్‌లో తొలిసారిగా మనిషికి సోకిన ప్రాణాంతక షమోండా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.