కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
Publish Date:Apr 16, 2026
Advertisement
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోలేరో వాహనంలో మొత్తం 21 మందిఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను కర్నాటక తరికి తాలూకా పరిసర గ్రామాలకు చెందిన కుమార్ (50), దీపిక వీణ (42), సునీల్ (40), యశోద (60), పుట్టమ్మ (55), లక్ష్మి, మీనాక్షి, బెల్లిగా గుర్తించారు. కాగా ఈ ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శనానికి వస్తూ భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
http://www.teluguone.com/news/content/horrific-road-accident-in-kurnool-district-36-217467.html





