సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్‌లో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై చర్యలు తీసుకోవాలని సినీ నటి అషు రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట ఈ వ్యవహారంపై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన ఆమె పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 6కు వాయిదా వేసింది. అనంతరం మధ్యంతర ఆర్డర్ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఆశు రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంపై టెలివిజన్ ఛానెల్స్, న్యూస్ వెబ్‌సైట్లు, యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వరకు ధృవీకరించని సమాచారంతో జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ అంశాన్ని నిర్ణయించాల్సిన సరైన వేదిక కోర్టులేనని.. మీడియా ట్రయల్ కాదనీ పేర్కొన్న ఆషురెడ్డి.. హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు పోస్టులు తొలగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే తన న్యాయవాదులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-court-issues-key-orders-regarding-media-reports-36-218709.html
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాలు యువ పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. నేడు భారత్ లో 1. 25 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా టూ టైర్ 2, 3 పట్టణాల నుంచి మొదలైనవి కావడం విశేషం.