పెనుగాలుల బీభత్సం.. వెయ్యి ఎకరాల్లో పంటనష్టం

Publish Date:May 2, 2026

Advertisement

మొన్నటివరకు కనీస మద్దతు ధర లేక చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేక పశువులకు వదిలేసి కుదేలు అయిన రైతన్నలు.. ఇప్పుడైనా అయినా పరిస్థితులు దారిలోకి వస్తాయి అని ఆశిస్తే..  పెనుగాలి, అకాలవర్షాలు వారి ఆశలను అడియాశలు చేశాయి. 

పులివెందుల నియోజకవర్గంలో  గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం   రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా  అరటి పంట తీవ్రంగా దెబ్బతింది.   వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై..   రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, ఈ.కొత్తపల్లి, కనంపల్లె, మొట్నూతల పల్లి, నల్లగొండూవారి పల్లి, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లో సుమారు 520 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. అలాగే..  లింగాల మండల పరిధిలో గుణకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారిచిం తలతో పాటు పలు గ్రామాల్లో 500 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బంది.  ఒక్కసారిగా వీచిన రాకాసి గాలులు అరటి చెట్లను నేలకూల్చడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటను కోత దశకు తీసుకువచ్చిన రైతులకు ఈ నష్టం తేరుకోలేని విధంగా దెబ్బతీసింది.  అధికారులు దెబ్బతిన్న తోటలను పరిశీలించి ప్రాథమిక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి, నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తీవ్రంగా నష్టపోయిన రైతులు మాత్రం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని   కోరుతున్నారు. సాగులో పెట్టిన పెట్టుబడులు, అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని   వాపోతు న్నారు. పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.  పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా గాలికి పడిపోవడం చాలా బాధాకరమనీ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఆదుకోవాలి  అని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

By
en-us Political News

  
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.