ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు శుక్రవారం (మే1) ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, పరిశోధన సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని జాతీయ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/construction-work-for-the-basavatarakam-cancer-hospital-begins-36-218708.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.