ఏపీ మద్యం స్కామ్ కేసులో రంగంలోకి దిగిన ఐటీ

Publish Date:May 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో ఐటి అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును  వేగవంతం చేశారు. ఈ స్కామ్ ద్వారా రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..  ఆ మొత్తానికి సంబంధించిన పన్ను వివరాలను సేకరించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు.   ప్రాథమిక సమాచారం ఆధారంగా  ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు.

దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా సేకరించిన నగదులో కొంత భాగం విదేశాలకు తరలించిననట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని దుబాయ్ కి పంపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బు తరలింపు పద్ధతి, విదేశీ లింకులు, లబ్ధిదారులపై ఇప్పుడు ఐటీ విచారణ కేంద్రీకృతమైంది.

ఈ వ్యవహారం ద్వారా ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమ నగదు జనరేట్ అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఎక్కువగా బ్లాక్ మనీ రూపంలో చలామణి అయినట్టు భావిస్తున్నారు. డిజిటల్ ట్రైల్ బయటపడకుండా ఉండేందుకు ఎక్కువ లావాదేవీలు నగదు రూపంలో నిర్వహించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. 

డిస్టిల్లరీలు,  వెండర్లకు ఐదు సార్లు ఎక్కువగా చెల్లింపులు చేసినట్లుగా అధికారులు గుర్తించారు.  ఎలాంటి మెటీరియల్ సప్లై జరగకపోయినా ఫేక్ ఇన్వాయిస్‌లతో చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. రెండు డిస్టిల్లరీలు కలిపి రూ.76.92 కోట్లు నకిలీ బిల్లింగ్ ద్వారా తరలించినట్టు ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో వెండర్లకు ఐదు రెట్లు అధికంగా చెల్లింపులు చేసినట్టు గుర్తించడం ఈ కేసులో కీలక అంశంగా మారింది.

డిజిటల్ ట్రైల్ బయటపడకుండా ఉండేందుకు లాభాలను పూర్తిగా బ్లాక్‌లో దాచిపెట్టినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, త్వరలోనే మరిన్ని సోదాలు, నోటీసులు జారీ అయ్యే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.  

By
en-us Political News

  
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా  ప్రజల ఫోన్లకు శనివారం  అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.