హీరో విజయ్ దేవర కొండకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మొన్నటికి మొన్న హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కానీ ఈ ప్రమాదంలోహీరోకు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకు న్నారు.
హీరో విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి తన కారులో పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయం లో జోగులాంబ గద్వాల జిల్లా ఎన్ హెచ్ 44 పై ఉండవెల్లి స్టేజ్ సమీపానికి రాగానే హీరో విజయ్ దేవర కొండ ప్రయాణి స్తున్న కారును వెనుక నుండి ఓ బొలేరో వాహనం స్వల్పంగా ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రమాదవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఈ ఘటన అనంత రం విజయ్ దేవర కొండ వెంటనే తన తల్లిని తీసుకొని మరో కారులో హైద రాబాద్ బయలుదేరి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకున్నారు. సమాచారం అందు కున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించడమే కాకుండా బొలేరో వాహన యజమాని పైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.అయితే రోడ్డు ప్రమాదంలో తమ హీరో విజయ్ దేవరకొండకు ఎటు వంటి గాయాలు కాలేదని, తృటిలో ప్రమాదం తప్పిందని తెలియగానే అభి మానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hero-vijay-devarakonda-36-207464.html
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్‌ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.