అమరావతికి చట్టబద్ధత.. స్వాగతించిన స్వప్నాదత్

Publish Date:Apr 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమరావతి రాజధాని అంశంపై సినీ పరిశ్రమ ఆమోదయోగ్యం కాని మౌనం వహిస్తున్నది.  అయితే ఈ ఒక్క విషయం అనే కాదు.. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల విషయంలో టాలీవుడ్ స్పందించడం కంటే మౌనమే మేలన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నది. జగన్ హయాంలో చిత్రపరిశ్రమ విషయంలో  ఆయన అనుసరించిన తీరు, అవమానించిన విధం నుంచి టాలీవుడ్ ఇప్పటికీ తేరుకోనట్లుగానే కనిపిస్తున్నది. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనం వీడలేదు. 

ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అమరావతికి మద్దతుగా హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గళం విప్పినా.. వారిరువురూ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ కారణంగా వారి అభిప్రాయం చిత్రపరిశ్రమ అభిప్రాయంగా భావించలేని పరిస్థితి ఉంది. అయితే గతంలో అంటే జగన్ హయాంలో జగన్ నిర్ణయాలను ధైర్యంగా ఇసుమంతైనా జంకు లేకుండా విమర్శించిన అశ్వినీదత్ అప్పట్లో తన గళాన్ని గట్టిగా వినిపించారు.

ప్రముఖ సినీ నిర్మాత అయినా.. పలు భారీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ  ఏ మాత్రం భయం లేకుండా జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.ఇక ఇప్పుడు ఆయన కుమార్తె స్వప్ప దత్.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల కావడాన్ని స్వాగతించారు.  ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టుకు అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను షేర్ చేశారు.

చిత్రపరిశ్రమలో ఉంటూ భారీ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నా కూడా స్వప్నా అశ్వినీదత్.. రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా, ధైర్యంగా వెళ్లడించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె రాజకీయ పరిణామాలపై తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడం పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఎక్సైజ్ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి.
జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఒక హృద్యమైన సంఘటన అందరి మనసులను తాకింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది.
ప్రముఖ కన్వెన్షన్ వ్యాపారవేత్త శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు.
ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలు.
భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేది దేశీయ వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, గత కొన్ని సంవత్సరాల్లో బలపడ్డ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు. 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతం వృద్ధి తరువాత కూడా, భారత్ బలమైన స్థితిలోనే ప్రపంచ అనిశ్చితిలోకి ప్రవేశిస్తోందని అధ్యయనం పేర్కొంది.
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.