ఈ ఏడు ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా?

Publish Date:Jun 25, 2026

Advertisement

భాగ్యనగర  ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలకు   వైభవంగా అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని   ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కర్ర పూజ నిర్వహించారు.

ఈ  కార్యక్రమంతో విగ్రహ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.   ఈ ఏడాదితో 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.  ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనా పోస్టర్‌ను  ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు   ఆవిష్కరించారు.  

ఈ ఏడాది  ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ స్వామివారు భక్తులకు ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమివ్వనున్నారు.  శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలోగణేషుడు ఖైరతాబాద్ గణేష్ మంటపంలో కొలువుదీరనున్నాడు.  పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, పూర్తి పర్యావరణహితంగా మట్టితో   69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో  ఈ ఏడు గణేష్ విగ్రహం రూపుదిద్దుకోనుంది.   స్వామివారికి ఉండే ఐదు ముఖాలు ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీకగా నిలవనున్నాయని పండితులు చెబుతున్నారు. వచ్చే సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి పర్వదినం. ఆ రోజు నాటికి ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీ పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది.  

By
en-us Political News

  
కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల (PPF, SCSS, SSY) కొత్త వడ్డీ రేట్లను ప్రకటించబోతోంది. జూన్ 30 లోపు మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకొని గరిష్ట వడ్డీ రేట్లను ఎలా లాక్ చేసుకోవాలో, పన్ను ప్రయోజనాలు ఎలా పొందాలో ఈ వెబ్ స్టోరీలో చూడండి.
అంతర్జాతీయ కారణాలతో భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు. 8 నెలల తర్వాత తొలిసారిగా 4,000 డాలర్ల మార్కు దిగువకు చేరిన స్పాట్ గోల్డ్. పసిడి మార్కెట్ తాజా అంచనాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత్-యూకేల మధ్య కుదిరిన చారిత్రాత్మక CETA మరియు DCC ఒప్పందాలు జూలై 15 నుండి అమలులోకి రానున్నాయి. 75,000 మంది నిపుణులకు చేకూరనున్న లబ్ధి, సుంకాల రద్దు వివరాలు ఇవే!
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా చిక్కుకుపోయిన నౌకల తరలింపును ఐక్యరాజ్యసమితి (IMO) నిలిపివేసింది. ప్రపంచ చమురు సరఫరాపై ఈ ఉద్రిక్తతల ప్రభావం మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఘోర ట్రాఫిక్ జామ్. హెబ్బాల్ నుండి విండ్సర్ మేనర్ వరకు కేవలం 3 కిలోమీటర్ల దూరం దాటడానికి ప్రయాణికుడికి పట్టిన 70 నిమిషాల నరకయాతన కథనం ఇక్కడ చదవండి.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) 2026 దరఖాస్తు ప్రక్రియ మరియు సరికొత్త వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. డాలర్ కాకుండా ఏ కరెన్సీలోనైనా చమురు చెల్లింపులు స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంతో భారతదేశానికి చమురు దిగుమతులు చౌకగా లభించే అవకాశం ఉందా? రష్యా తరహాలోనే ఇరాన్ నుండి కూడా రూపాయిల్లో వ్యాపారం సాధ్యమేనా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మోకిలాలో HMDA నివాస స్థలాల భారీ ఈవేలానికి రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తోంది. జూన్ 27 సాయంత్రం 5 లోపు ఈఎండీ చెల్లించి రిజిస్టర్ చేసుకోండి. పూర్తి వివరాలు, ధరలు ఇవే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి 12 వికెట్లతో పూనమ్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది.
విదేశీ ప్రయాణం తక్కువ ఖర్చుతో చేయాలనుకుంటున్నారా? విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ మరియు ఆహార ఖర్చులను 50% వరకు తగ్గించుకునే అద్భుతమైన బడ్జెట్ ట్రావెల్ టిప్స్ ఇక్కడ చూడండి.
. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం.. ఇక్కడి విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ( యూఎల్ బీ) పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసి, దానిని తిరిగి ఉత్పాదక రంగాల్లో వినియోగించడమే లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేసే వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి, వాటిని వివిధ అవసరాలకు మళ్లించనున్నారు.
మహేశ్ దీక్షిత్ కు దేశ రక్షణ వ్యూహాలను రచించడంలో  దశాబ్దాల  అనుభవం ఉంది. 1993 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేశ్ దీక్షిత్ తన  కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే పని చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.