ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

Publish Date:Jun 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  ప్రాథమిక విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలు, అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పొగడ్తల వర్షం కురుస్తోంది.  ఏపీలో ప్రాథమిక విద్యా విధానం అద్భుతంగా ఉందంటూ ప్రపంచ బ్యాంకు  ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం..  ఇక్కడి విద్యా ప్రమాణాల పట్ల  సంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

చిన్న వయసులోనే పిల్లల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ఆటల ఆధారిత బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల చిన్నారులు చదువుపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని తమ పర్యటనలో గమనించినట్లు వారు పేర్కొన్నారు. ఆధునిక విద్యా సాధనాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లాస్‌రూమ్‌లలో సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగం ఉపాధ్యక్షుడు జోహెన్సే జుట్  ప్రత్యేకంగా ప్రశంసించారు.  

ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిథి బృందం  ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ పాఠశాలలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని, విద్యార్థుల స్పందనను ప్రత్యక్షంగా గమనించారు.   రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలువుతున్న సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రాన్ ఫర్మేషన్ (సాల్ట్) పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా, ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేయడం వంటి అంశాల్లో 'సాల్ట్' ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తోందంటూ ఆ బృందం పొగడ్తల వర్షం కురిపించింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి
కుల, మతాలకు అతీతంగా జరిపే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఎలా మొదలైంది..?
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం
పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు
యాపిల్ మాక్ ఓఎస్ యూజర్ల కోసం నార్టన్ వీపీఎన్ స్ప్లిట్ టన్నెలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరుస్తూ, నిర్దిష్ట యాప్‌లను వీపీఎన్ పరిధి నుండి ఎలా మినహాయించవచ్చో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఉరుగ్వేపై 1 0 తేడాతో స్పెయిన్ ఘన విజయం. అలెక్స్ బేనా సంచలన గోల్‌తో స్పెయిన్ నాకౌట్ దశకు చేరుకోగా, రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
చిన్న పిల్లల సురక్షిత టీవీ వీక్షణ కోసం హైసెన్స్ సరికొత్త సేఫ్ స్ట్రీమింగ్ మ్యాజిక్ రిమోట్‌ను పరిచయం చేసింది. 50,000 పైగా చైల్డ్-సేఫ్ ఎపిసోడ్‌లతో కూడిన ఈ సరికొత్త టెక్నాలజీ వివరాలు ఇవే!
మేడ్చల్–మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టి కబ్జాదారులకు షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.