హెచ్ సీఏలో సమ్మె సైరన్
Publish Date:Mar 5, 2026
Advertisement
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారౌతోంది. నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటోంది. తాజాగా హెచ్‌సీఏలో ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు. సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి నెలల ముందు హెసీఏ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ల పరిస్థితి ఏమిటా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం హెసీఏ ఉద్యోగులు గురువారం (మార్చి 5) నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పనులు నిలిపివేసి నిరసన చేపట్టారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో హెసీఏ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. హెచ్‌సీఏ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ బకాయిలు చెల్లించాలనీ, అలాగే గ్రౌండ్ సిబ్బందికి ఇవ్వాల్సిన కన్వేయన్స్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలనీ, హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. తమ సమ్మె కారణంగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగకుంటే అందుకు హెసీఏయాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/hca-employees-indefinate-strike-36-215052.html





