ప్రియురాలి మృతి... ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ప్రియుడు సూసైడ్

Publish Date:Jan 7, 2026

Advertisement

 

హయత్‌నగర్, యాచారం ప్రాంతాల్లో వరుసగా చోటుచే సుకున్న ఆత్మహత్యలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయ విదారక సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. యాచారం మండలంలో నివాసం ఉంటున్న పూజ (17) అనే బాలిక నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే పూజ మరణించినట్లుగా వైద్యులు దృవీకరించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో  ప్రేమ జంట సిద్ధగోని మహేష్ (20), పూజ(16) గత నాలుగు నెలలుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.  దీంతో ఇటీవలే ఈ ప్రేమ జంట మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం రోజు ప్రియుడు మహేష్ బాలిక పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తీవ్ర మన స్థాపానికి గురైన పూజ మంగళవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పూజ మృతికి కారణం ఆమె ప్రేమ వ్యవహారమేనని బంధువులు ఆరోపిస్తు న్నారు. పూజ, సిద్ధగోని మహేష్‌ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబ సభ్యులకు తెలుసు... పూజ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. 

అయితే పూజ ఆత్మహత్యకు బాధ్యుడిగా మహేష్‌ను పేర్కొంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మహేష్‌ను విచారణకు పిలిచారు.పూజ ఆత్మహత్య చేసుకున్న విషయం  తెలియగానే మహేష్ తీవ్ర మనస్తాపానికి గురై నాడు. పూజ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు లోనైన మహేష్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటిం చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే మహేష్ మృతి చెందాడు..మహేష్, పూజ ఇద్దరూ గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అప్పట్లో కుటుంబ సభ్యులు, పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుబాటు చేసినట్లు సమాచారం. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు ఈ విషా దాంతానికి దారి తీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రేమికులు మరణించడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి..ఈ రెండు ఘటనలపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారంలోని అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

By
en-us Political News

  
ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హైదరాబాద్‌కు రావడం గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ భువనేశ్వరికి అరుదైన అవార్డు వరించింది
మహిళా ఐఏఎస్‌లపై కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేయడం ఆందోళనకరమైన విషయం అని మంత్రి సీతక్క అన్నారు
చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య నుంచి కేటుగాడు రూ.2.58 కోట్లను కాజేశాడు
అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.
సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది.
ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు.
ఒడిశాలో పెను ప్రమాదం తప్పింది.
భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.