Publish Date:Aug 12, 2022
బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువు తీరిన అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీహార్ లో బీజేపీయేతర శక్తులన్నీ ఏకమైన విధంగానే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు మార్గం సుగమమైందని పరిశీలకులు అంటున్నారు.
గతంలోలా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న పోటీ తీవ్రత గణనీయంగా తగ్గిందంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ లు చొరవ తీసుకుంటారని చెబుతున్నారు. వారి వెనుక ర్యాలీ కావడానికి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలకు ఎటువంటి అభ్యంతరం ఉండక పోవచ్చునని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూటమి ఏర్పాటు సన్నాహాలలో భాగంగానే తేజస్వి యాదవ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అదినేత్రితో బేటీ అయ్యారని అంటున్నారు.
సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఇక దేశ వ్యాప్తంగా బీహార్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. బిహార్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైన విధంగానే, దేశ వ్యాప్తంగా కూడా రాజకీయ బీజేపీయేతర రాజకీయ పార్టీలు విభేదాలు విస్మరించి ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేజస్వి యాదవ్ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతపర ఘర్షణలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీంతో ప్రజాభీష్టం మేరకు 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించడమే ఇప్పుడు దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఆ బాధ్యతతోనే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడానికి సుముఖంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ లో అదే జరిగిందనీ, దేశ వ్యాప్తంగా ఇదే రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్ పరిణామాలు బీజేపీకి చెంపపెట్టు వంటివని అన్నారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం అసాధ్యమన్న తేజస్వి యాదవ్..బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని పేర్కొన్నారు. కాగా తన హస్తిన పర్యటనలో సోనియాగాంధీతో పాటు పలువురు విపక్ష నేతలతోనూ తేజస్వి ప్రసాద్ భేటీ అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/haed-time-to-bjp-in-future-says-tejaswi-39-141838.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.