చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్.. ప్లేఆఫ్ రేసు నుంచి చెన్నై ఔట్

Publish Date:May 21, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర కింగ్స్ ప్రస్థానం ముగిసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలై ప్లేఆఫ్ రేసు వైదొలగింది.   ఈమ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ  విజయంతో గుజరాత్ టైటాన్స్ జట్టు  టాప్-2 స్థానం దాదాపుగా ఖాయం చేసుకుంది.  

 టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్   అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.  అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 37 బంతుల్లో 64 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే  సాయి సుదర్శన్  53 బంతుల్లోనే 84 పరుగులతో చెన్నై బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.  మొదటి వికెట్‌కు వీరిరువురూ   నూటపాతిక  పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గుజరాత్ భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత   జాస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి  కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ   స్కోరు  సాధించింది.

  230 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. గుజరాత్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన పదునైన బౌలింగ్‌తో తొలి ఓవర్లలోనే సీఎస్‌కే కీలక వికెట్లు పడగొట్టి కోలుకోలేని దెబ్బ తీశాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడానికి శివమ్ దూబే తీవ్రంగా శ్రమించాడు. దూబే కేవలం 17 బంతుల్లో 47 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి అవతలి వైపు నుంచి తగిన మద్దతు లభించలేదు.

చెన్నై మిగతా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు చేతులెత్తేయడంతో, సీఎస్‌కే జట్టు కేవలం 13.4 ఓవర్లలోనే 140 పరుగులకే  కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగి  చెన్నై పతనాన్ని శాసించారు.  

By
en-us Political News

  
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు
చంద్ర‌బాబును చేర‌దీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌దా? అలాంటి చంద్ర‌బాబు రాజారెడ్డిని హ‌త్య చేయించి ఉంటారా?
ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణ సచివాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొని ఉంది.
కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య బాధ్యతలు, హక్కులపై బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక.
అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, టి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.