దయామయులకు వందనం !! 

Publish Date:Nov 13, 2021

Advertisement

ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు. ఒకరికి మరొకరు విభిన్నమైన వారు. కొందరిలో క్రూరత్వం, మరికొందసరిలో సాధుస్వభావం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పెరిగిన పరిస్థితుల ఆధారంగానే ఉన్నా, తమ అనుభవాల కారణంగా అటు వారు ఇటు, ఇటు వారు అటు మారిపోయిన, మారిపోతున్న సందర్భాలు కూడా బోలెడు.  అయితే ప్రపంచానికి దయా హృదయాన్ని పంచినవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఎమిటో తెలుసుకుని ఆ మాటలను పిల్లలకు చెబితే

నేటి పిల్లలు రేపటి దయామయులు అవుతారు. 

సాధారణంగా అందరూ చేసే తప్పు ఒకరిని తక్కువగా చూడకూడదు, పేదవారిని ఎగతాళి చేయకూడదు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి ఇలాంటి మాటలు పిల్లలకు చెప్పడం. ఇవి తప్పు మాటలా అని అందరికి అనిపిస్తాయి. కానీ వంద మాటలు చెప్పడం కన్నా ఒక చిన్న పని పిల్లల చేత చేయించడం ఎంతో ఉత్తమం. నీతి కథలను, వేమన పద్యాలను, సుభాషితాలను పిల్లలచేత వల్లే వేయించి వాళ్లకు నీతిని, దాయను, జాలిని నూరిపోస్తున్నాం అనుకుంటారు కానీ కేవలం మాటల వల్ల మాత్రమే వాటి తాలూకూ విలువలు పిల్లల్లో పెంపొందవు.  పేదవాళ్లకు, కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయించాలి. చిన్నదా పెద్దదా అనే సంశయం అక్కర్లేదు. నేటి విత్తనమే రేపటి వృక్షం. పిల్లలతోనే నేరుగా సహాయం చేయించడం వల్ల దాని లోతులు పిల్లలకు తెలుస్తాయి. 

మొక్కల పెంపకం

ఓ మొక్కను నాటించి దాన్ని సంరక్షించి, నీళ్లు పోసి, కలుపు తీసి దాన్ని పెద్దగయ్యేలా చేయడంలో ఉన్న శ్రమ పిల్లల్లో బాధ్యతను తెలుపుతుంది. పెద్దవారి పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండేలా అది తోడ్పడుతుంది. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల సందర్శన వృద్ధాశ్రమాలలో దిక్కులేని వృద్ధులు బిక్కు బిక్కుమని గడుపుతుంటారు. వారి దగ్గరకు తీసుకెళ్తే వారి దయనీయ పరిస్థితులు, అనాధాశ్రమాలలో పిల్లల జీవితాలు చూడటం ద్వారా జీవితంలో తాము ఎంత మంచి స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. వారికి సహాయం చేయాలనే మనస్తత్వం పెంపొందుతుంది. 

జంతువుల పట్ల భూతదయ..

ఇంట్లో ఏదో ఫాషన్ కోసమూ, స్టేటస్ కోసమూ పెంపుడు జంతువులను పెంచడం కాదు. వీధి కుక్కలు, పిల్లులుకు ఆహారం పెట్టడం. ఇంటి గోడ మీద వాలే పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం. మూగజీవాలను కొట్టకుండా వాటికీ మనసు ఉంటుందని వాటి చర్యలకు అర్థం వివరిస్తూ జంతువులను అర్థం చేసుకునేలా చేయడం. సమాజంలో తిండి, నీరు, కట్టుకోవడానికి బట్టలు లేక ఉండటానికి సరైన నివాస ప్రాంతాలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు జీవితంతో ఎలా పోరాటం చేస్తున్నారో, వీధి బాలలు తమ బాల్యాన్ని చిత్తు కాగితాల మధ్య ఎలా కోల్పోతున్నారో అర్థమయ్యేలా చెబుతూ మీ చుట్టూనే ఉన్నవారిని ఉదాహరణగా చూపించడం వల్ల పిల్లల్లో ప్రత్యక్ష ప్రతిస్పందనలు కలుగుతాయి.
ఈ దయ అనేది పిల్లలోనే కాకుండా పెద్దలలో కూడా పెంపొందాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వార్థంలో కూరుకుపోయిన ఎందరో మార్పు చెంది ప్రపంచాన్ని కూడా మార్చాల్సిన సమయం ఆసన్నమయ్యింది. 

నవంబర్ 13 ప్రపంచ దయా దినోత్సవం సందర్బంగా అందరిలో ఈ విషయం పట్ల అవగాహన పెంచేందుకు ఇదొక చిన్న ప్రయత్నం. మీరు మీ చుట్టుపక్కల వారిలో మార్పు కోసం ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల ఉన్న కరుణా మూర్తులకు వందనం సమర్పించండి.


◆ వెంకటేష్ పువ్వాడ

 

 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.