విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా

Publish Date:May 14, 2026

Advertisement

విజయవాడ, తిరుపతి నగరాలకు గ్రేటర్ హోదా కల్పించడానికి ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తోంది.  ఆ రెండు నగరాల విస్తీర్ణం పెంచేందుకు.. 10 మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలను విలీనం చేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోకి మరో 64 పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది..  కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.

విజయవాడ గ్రేటర్‌ సిటీ ప్రతిపాదనలో భాగంగా ఆరు మండలాల్లో ఉన్న 75 పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని  2014-2019 మధ్య ప్రతిపాదనలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనల్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటైతే కేంద్రం నుంచి నిధులు కూడా వస్తాయి. అందుకే ఈ ప్రక్రియన వేగవంతం చేయనున్నారు. విజయవాడలోకి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు, పట్టణాలు కలిసిపోయాయి. కానీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల హోదాలోనే ఉడటంతో అభివృద్ధికి అవకాశం లేకుండా పోయింది. అందుకే విలీన ప్రక్రియను పూర్తిచేసి విజయవాడను గ్రేటర్‌ కార్పొరేషన్‌గా మార్చాలని భావిస్తున్నారు.

తిరుపతిని గ్రేటర్ కార్పొరేషన్‌గా ఏర్పాటు, గ్రామాల విలీనానికి సంబంధించి గత ఏడాది తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లోని 64 గ్రామాలను గ్రేటర్ తిరుపతిలోకి విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మంగళం, అవిలాలలు తిరుపతి నగరంలో కలిసిపోయాయి. అవి పంచాయతీలుగా ఉండటంతో అభివృద్ధి పనులు నిలిపోయాయి. ప్రతిపాదించిన గ్రామాలతో పాటుగా నగరంలో కలిసిన ప్రాంతాలతో గ్రేటర్‌ తిరుపతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విలీన ప్రక్రియపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు.

గ్రేటర్‌ విశాఖపట్నంలోకి 64 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాలు ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన గ్రామాల్లో 60శాతం నగరంలో కలిసిపోయాయి. అందుకే ఈ పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకుంటే మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా గ్రామాల విలీనం చాలా ముఖ్యమని చెబుతున్నారు. గతంలో అనకాపల్లి, భీమిలి, గాజువాక మున్సిపాలిటీలు గ్రేటర్ విశాఖపట్నంలో విలీనమైన తర్వాతే అభివృద్ధి చెందాయని చెబుతున్నారు. మొత్తం మీద విశాఖకు తోడుగా విజయవాడ, తిరుపతి గ్రేటర్ సిటీలుగా మారబోతున్నాయి.

By
en-us Political News

  
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.