ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే!

Publish Date:May 14, 2026

Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పొదుపు మంత్రం పాటించాలని, ఇంధన వినియోగం తగ్గించాలని ఇచ్చిన పిలుపుతో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.  సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (మే 15) జరిగిన కేబినెట్ భేటీ  ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.  ఇంధన పొదుపులో భాగంగా వారానికి ఒక రోజు నో వెహికల్ డే  పాటించాలన్న  తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన పొదుపు చర్యలపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగింది. వాహనాలు కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టిపెట్టాలని నిర్ణంయించింది.  నాదేశం - నా బాధ్యత  పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది.  ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. 
మంత్రులు కూడా సెక్రెటేరియట్‌కు వచ్చేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఈవీ వెహికల్, సైకిల్‌ను వినియోగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది.  ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, సోలార్ ఎనర్జీనే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రమే తమ కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని.. ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టిసారించాలన్నారు. సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని  చెప్పారు.  అయితే.. ముఖ్యంగా వారానికి ఒక రోజు నో వెహికిల్స్ డే విషయంలో ప్రజలకు తెలియజేయాలని   ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు  రెండు రోజులు ప్రజలకు అన్ని పొదుపు చర్యలు వివరిద్దామన్నారు. 

By
en-us Political News

  
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.