Publish Date:Apr 26, 2022
విజన్ ఉన్న నాయకుడంటే చంద్రబాబే. ఉన్నది ఉన్నట్టు ఒప్పేసుకుంటారు. జగన్‌లా మాట తప్పుడు, మడమ తిప్పుడు ఆయన నైజం కాదు. కానీ, జగన్ అలా కాదు. ఎలాగైనా గెలిచి తీరాలని ఉద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి.. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి.. అందలం ఎక్కాక అడ్డంగా దగా చేసేశారు. ఉద్యోగులు ఇప్పుడు రోడ్డెక్కుతుంటే.. పోలీసులతో ఆ పోరాటాన్ని తొక్కేస్తున్నారు. సీపీఎస్ హామీని అటకెక్కించేసి.. ఉద్యోగుల నెత్తిన శఠగోపం పెట్టేసి.. ఇప్పుడు జీపీఎస్ ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు చూపిన ఆప్షన్‌నే.. ఇప్పుడు జగన్ మళ్లీ ఉద్యోగుల ముందుకు తెచ్చారు. మరి, సీపీఎస్ రద్దు అంటూ అవగాహన లేకుండా ఇచ్చిన హామీ సంగతేంటి? ఇంతకీ జీపీఎస్ అంటే ఏంటి? గతంలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది?
మూడేళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేశారు. చంద్రబాబు వాళ్లను చర్చలకు పిలిచారు. సీపీఎస్ రద్దు చేస్తే భవిష్యత్‌లో రాష్ట్రానికి విపరీతమైన నష్టం కలుగుతుంది కాబట్టి దానిని రద్దు చేయలేమని వారికి సూటిగా, స్పష్టంగా చెప్పారు. సీపీఎస్ బదులు అదనపు ప్రయోజనాలు కల్పించేలా జీపీఎస్ విధానం అమలు చేస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అప్పటికే హామీ ఇచ్చారు. అది నమ్మిన ఉద్యోగులు ఆ రోజు చంద్రబాబు చెప్పిన జీపీఎస్ ప్రతిపాదనను వినేందుకు కూడా ఆసక్తి చూపలేదు. చర్చల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మళ్లీ చర్చలకు రాలేదు. ఇదంతా మూడేళ్ల క్రితం నాటి విషయం.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం సీపీఎస్ రద్దుకు మూడేళ్ల పాటు ఊరించి ఉసూరుమనిపించింది. మాట తప్పి.. మడమ తిప్పి.. ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. తగదునమ్మా అంటూ.. ఆనాడు చంద్రబాబు ప్రతిపాదించిన జీపీఎస్‌ను తెరపైకి తీసుకొచ్చిందని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంతకంటే మంచి ప్రతిపాదనలే తమ ముందు పెట్టారని.. అయినా తాము సీపీఎస్ రద్దుకే పట్టుబట్టి వాటిని వినేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. జీపీఎస్ అనే అంటున్నా.. ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ఆఫర్స్ కంటే.. ఆనాడు చంద్రబాబు ఇస్తానన్న జీపీఎస్ ఇంతకంటే మెరుగ్గా ఉందని అంటున్నారు. జగన్ మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయరని తెలిస్తే.. ఆనాడు వైసీపీకి మద్దతుగా ఓటేసే వారమే కాదని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఉద్యోగులంతా జగనన్నకు గట్టి బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gps-offer-to-govt-employees-25-134990.html
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.