ఫ్యాన్ స్పీడ్ త‌గ్గింది.. వైసీపీ నేత‌ల్లో భ‌యం పెరిగింది

Publish Date:Apr 26, 2022

Advertisement

వైసీపీ దూకుడు మాయం అయిపోయింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మౌనం ఆ పార్టీ ఉనికినే నామమాత్రంగా మార్చేసింది. ఏ మంటే ఏమౌతుందోన్న భయం కొత్త మంత్రుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడూ ఎదురుదాడితో ప్రత్యర్థుల మీద విమర్శలతో విరుచుకుపడే వైసీపీలో ఇప్పుడెందుకీ మౌనం. 
పార్టీలో లొసుగులు, ప్రభుత్వంలో అవకతవకలు ఒక్కసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలలో బట్టబయలైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా అన్ని వర్గాలూ జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నాయని మంత్రి పదవులు కోల్పొయిన మాజీ సచివులు బహిరంగంగానే వెళ్లగక్కేసారు.
అదే సమయంలో తెలుగదేశం కూడా స్పీడ్ పెంచింది. మాట తిప్పని, మడమ తిప్పని వైసీపీ నేత అసలు రీతిని ఎండగడుతూ విమర్శల దూకుడు పెంచింది. మామూలు పరిస్థితుల్లో అయితే వైసీపీ శ్రేణులు, ట్రేడ్ మార్క్ నేతలు తెలుగదేశంపై దూషణలతో విరుచుకుపడేవారు. ఇప్పుడా పని చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ముందుకు రావడం లేదు అనే కంటే సాహసించడం లేదని చెప్పడం సబబుగా ఉంటుంది. వైకాపా మౌనం వ్యూహాత్మకమేమీ కాదనీ, సొంత పార్టీలోనే అసమ్మతి బుసలు కొడుతుంటే...ఏం మాట్లాడితే ఏమౌతుందోనన్న భయమే వారిని మౌనాన్నిఆశ్రయించేలా చేస్తున్నదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా విపక్షం విమర్శలను తిప్పి కొట్టే బాధ్యత మంత్రలు తీసుకుంటారు. జగన్ గత మంత్రివర్గం అంతా తమ శాఖకు సంబంధిచిన విషయాలపై కంటే ప్రత్యర్థి పార్టీని దనుమాడటంపైనే దృష్టి సారించారు. విమర్శలలో హద్దులను కూడా పాటించని సందర్భాలెన్నో ఉన్నాయి. విపక్ష నేతనూ, నేత కుటుంబీకుల్నీ కూడా వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా విమర్శలు చేశారు.
అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పరిధి దాటి విమర్శిస్తే ప్రజాక్షేత్రంలో పలుచన అవుతామన్న విషయం వారికి స్పష్టంగా అర్ధమైంది. ఇక తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శించాలంటే ఆ ప్రభుత్వ పాలనలో కంటే వైసీపీ పాలనలో అభివృద్ధి మెండుగా జరిగిందని చెప్పుకోగలగాలి. మూడేళ్ల పాలన అనంతరం అభివృద్ధి గురించి మాట్లాడేందుకు వైసీపీకి ఒక్క అంశం కూడా కనిపించని పరిస్థితి ఉంది.  సంక్షేమ పథకాల గురించి చెప్పుకుందామా అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులెవరూ తాము సంతోషంగా ఉన్నామని చెప్పడానికి ముందుకు రావడం లేదు. పైపైచ్చు ఏ వర్గాలకైతే తాము సంక్షేమ పథకాలు అందించామని వైసీసీ చెప్పుకుంటోందో...  ఆవర్గాల నుంచే ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 
ఈ పరిస్థితుల్లోనే కొత్త మంత్రులకు తమ ప్రభుత్వం ఘనత ఇదీ అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. కొత్త టీమ్ లో వాగ్ధాటి ఉన్న నేతలుగా గుర్తింపు పొందిన అంబటి రాంబాబు, రోజా కూడా మునుపటి విమర్శల దాడిని కొనసాగించేందుకు జంకుతున్నట్లుగా కనిపిస్తున్నది.
అంబటి రాంబాబు అయితే మంత్రిగా తొలి విలేకరుల సమావేశంలోనే మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను... నేను చెప్పింది రాసుకోండి చాలు అంటూ చేతులెత్తేశారు. ఇక రోజా సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతిని ఎదుర్కొంటూ...మౌనమే మేలు అన్నట్లుగా ఉన్నారు. మహిళా హోంమంత్రి తొలి మీడియా మీట్ లోనే తాను డమ్మీనని చెప్పకనే చెప్పేశారు.  ఇక మంత్రులకు బదులుగా మీడియా ముందుకు వచ్చి సర్కాస్టిక్ గా విపక్షంపై విమర్శలు గుప్పించే సజ్జల... కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత తొలి సారిగా తమ ప్రభుత్వ అజెండా ఏమిటన్నది బయటపెట్టేశారు. చంద్రబాబును మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని కుండ బద్దలు కొట్టేశారు. ఆ సింగిల్ పాయింట్ అజెండా తప్ప తమ ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదనేశారు.  దీంతో వైసీపీకి చెప్పుకోవడానికి ఇంకేం మిగలలేదు. అందుకే ఏం లేనప్పుడు మాట్లడడమెందుకని వైకాపా నేతలు మౌనాన్నే ఆశ్రయించారు. 
తన పలుకుబడి పలుచన అయ్యిందన్న గ్రహింపునకు  వచ్చిన జగన్ ఇక పాలన సంగతి తరువాత చూసుకుందాం...ముందు తనకు అచ్చొచ్చిన ఫార్ములా జనం సమస్యలు తెలుసుకునే పేరుతో ప్రజలలోకి వెళదాం అన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే  రాజకీయ పండితులు మాత్రం విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి వెడితే సమస్యలు తెలుస్తాయి కానీ, అధికారంలో ఉండి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రజలలోకి వెళ్లడం వల్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు.

By
en-us Political News

  
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.