ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం అంతా చాలా బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ పాల మరణాలు, బాణాసంచా పేలుడు ఘటన కారణంగా జరిగిన మరణాలు ఉన్నా.. జగన్ ఆయా సంఘటన బాధితులను పరామర్శించే పని పెట్టుకోలేదు. ఈ వారంలో ఆయన షెడ్యూల్ లో పెళ్లి వేడుకలకు హాజరు కావడం మాత్రమే ఉంది. తొలుత ఆయన సోమవారం కల్తీ పాల మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి.
అయితే సోమవారం వచ్చింది. వెళ్లింది. కానీ జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టలేదు. మంగళవారం (ఫిబ్రవరి 3)ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. ఆ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క్ తాడేపల్లి ప్యాలెస్ ను విజిట్ చేసి తన కుమారుడి పెళ్లికి జగన్ ను ఆహ్వానించి, ఆహ్వానపత్రిక ఇచ్చారు. వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు. దీంతో అంతకు ముందు రోజే అమరావతిలో చంద్రబాబును కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన భట్టి, మరో సారి ఏపీకి వచ్చి జగన్ ను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది.
సరే జగన్ భట్టి అందించిన ఆహ్వాన పత్రికను అందుకోవడం వినా మంగళవారం (మార్చి 3) మరో కార్యక్రమం పెట్టుకోలేదు. ఇక బుధవారం (మార్చి 4) జగన్ అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. , ఆ తరువాత విశాఖ లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వాసుపల్లి గణేష్ కుమారుడి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వాసుపల్లి నివాసానికి వెళ్లిన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రెండు సందర్భాలలోనూ జగన్ భారీ జనసమీకరణ జరిగేలా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. తాడేపల్లికి తిరిగి వచ్చారు. సాధారణంగా జగన్ తన రెండుమూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో పరామర్శ యాత్రలకూ, తన నివసంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ వారం మాత్రం ఆయన ఆనవాయితీని కాదని.. ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి, మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఆశీర్వదించి రావడానికే పరిమితమయ్యారు.
మండలిలో లడ్డూ వివాదంపై రభస జరుగుతున్నా దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు కారణంగా మరణాలు సంభవించినా, కాకినాడ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడులో పలువురు మరణించినా.. ఆయా ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించాలని కూడా భావించలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-avoided-paramarsalu-25-214996.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు.