మిఖాయిల్ గోర్బచెవ్ కనుమూత
Publish Date:Aug 31, 2022
Advertisement
సోవియెట్ చివరి అధ్య క్షుడైన మిఖాయిల్ గోర్బ చెవ్ కన్నుమూశారు. గోర్బచెవ్ తన 91వ ఏట దీర్ఘకాలికవ్యాధితో బాధప డుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారని రష్యా సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ ఒక ప్రకట నలో తెలిపిం ది. ప్రచ్ఛన్న యుద్ధా న్ని రక్తపాతం లేకుండా ముగించిన మిఖాయిల్ గోర్బచెవ్ సోవి యట్ యూనియన్ పతనాన్ని నిరోధించడంలో విఫలమయ్యారని మాస్కోలోని ఆసుపత్రి అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గోర్బచెవ్ మరణం పై తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడంలో, సోవియట్ యూనియన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను తగ్గించడంలో, తూర్పున మార్క్సిస్ట్-లెనినిస్ట్ పరిపాలనల పతనం, జర్మనీ పునరేకీకరణ - రెండింటినీ తట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసలు పొందాడు. దీనికి విరుద్ధంగా, సోవియట్ పతనాన్ని ఆపలేక పోయినందుకు రష్యాలో నిందారోపణలకు గురౌతూంటారు. ఈ సంఘటన ప్రపంచంలో రష్యా యొక్క ప్రభావం క్షీణించడానికీ, ఆర్థిక సంక్షోభానికీ దారి తీసింది. దీనికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. అణ్వా యుధాలను పరిమితం చేయడానికి, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికీ అప్పటి అమెరికా అధ్య క్షుడు రొనాల్డ్ రీగన్‌తో శిఖ రాగ్ర సమావేశాలను నిర్వహించారు. సోవియట్ యూనియన్ కు ఎనిమిదవ, చివరి నేత. 1985 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. 1988 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ దేశాధినేతగా, 1988 నుండి 1989 వరకు సుప్రీం సోవియట్ ప్రెసీడియం ఛైర్మన్‌గా, 1989 నుండి 1990 వరకు సుప్రీం సోవియట్ ఛైర్మన్‌గా, 1990 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. సైద్ధాంతికంగా, అతడు మొదట్లో మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి ఉన్నారు, అయితే 1990 ల ప్రారంభంలో సామ్యవాద ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాడు. సోవియట్ యూనియన్ వంటి సోషలిస్ట్ సమాజంలో శత్రుపూరిత వైరుధ్యాలు ఉండవని వారు విశ్వసించారు. అయితే, ఓవైపు సంస్కరణలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తూనే, చాలామంది బ్యూరోక్రాట్లు సంస్కరణల గురించి పై పై కబుర్లు చెబుతున్నారని ప్రజల్లో అభిప్రాయం నెలకొంది. తాను నాయకుడి గా ఉన్న కాలంలో లోనే గోస్ప్రియోమ్కా (ఉత్పత్తిపై ప్రభుత్వామోదం) అనే భావనను కూడా గోర్బచేవ్ ప్రవేశ పెట్టారు. ఇది నాణ్యతా నియంత్రణను సూచిస్తుంది. 1986 ఏప్రిల్లో, అతడు ఒక వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టాడు. జీతా లను ఉత్పత్తితో ముడి పెట్టాడు. సామూహిక సాగుదారులు తమ ఉత్పత్తులలో 30% నేరుగా దుకాణాలకు లేదా సహకార సంస్థలకు విక్రయించడానికి అనుమతించాడు. 1986 సెప్టెంబరులో చేసిన ప్రసంగంలో, పరిమిత ప్రైవేట్ సంస్థలతో పాటు మార్కెట్ ఎకనామిక్స్‌ను తిరిగి ప్రవేశ పెట్టాలనే ఆలోచనను వెలిబుచ్చాడు. ఈ సందర్భంలో లెనిన్ చెప్పిన కొత్త ఆర్థిక విధా నాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు.
http://www.teluguone.com/news/content/gorbchev--died-25-142982.html





