తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కమిటీ సభ్యులంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మహానాడును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన చంద్రబాబు, ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ పండుగగా భావించే మహానాడు కార్యక్రమం జరగనుంది.
  విజయ్, సతీశన్ అడుగుజాడల్లో... వైరల్‌గా మారిన కేరళ సీఎం, మాజీ సీఎంల భేటీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ మార్పు సాధ్యమేనా.. భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు, విభేదాలకు భిన్నంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో సరికొత్త ‘ఫ్రెండ్లీ పాలిటిక్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికల సమరంలో ఎంతగా తలపడినా.. అధికారం దక్కిన తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనే ఉన్నతమైన రాజకీయ సంస్కృతిని అక్కడి నేతలు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కేరళ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సతీశన్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసానికి వెళ్లి, ఆయనను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఉభయ నేతలూ ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించడం విశేషం. ఇదే తరహా అరుదైన దృశ్యం కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ ఆవిష్కృతమైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్.. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలను స్వయంగా కలిసి మర్యాదపూర్వకంగా సంభాషించారు.     ఈ రెండు పరిణామాలు గెలిచామనే గర్వం కానీ, ఓడిపోయామనే నైరాశ్యం కానీ లేకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో నేతలు ఎంత పరిణతితో వ్యవహరిస్తున్నారో నిరూపిస్తున్నాయి. ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని వీరు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ సానుకూల పరిణామాలపై అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభుత్వాల పనితీరును మెరుగుపరచడానికి, ప్రజల్లో రాజకీయాల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన తర్వాత కూడా పార్టీల మధ్య వైషమ్యాలు, వ్యక్తిగత విమర్శలు, ప్రతీకార రాజకీయాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు, కేరళ నేతల తరహాలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆత్మీయంగా కలుసుకునే రోజులు ఎప్పుడు వస్తాయా అని సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులోనైనా తెలుగు నేలపై ఇటువంటి సంస్కృతి చిగురిస్తుందో లేదో వేచి చూడాలి.  
తిన్నామా ప‌డుకున్నామా తెల్లారిందా..  అన్న‌ట్టు బ‌ట‌న్ నొక్కామా.. జ‌నాన్ని బుట్ట‌లో ప‌డేసుకున్నామా.. దాని వెన‌క  స్కాములు చేసుకున్నామా? అన్న‌ట్టు సాగిన వైసీపీ  పాల‌న‌కు నేడు కూట‌మి  చేస్తున్న  పాల‌న‌కూ ఎంతో తేడా ఉంద‌ని అంటారు విశ్లేష‌కులు.  ప్ర‌స్తుత  కూట‌మి ప్ర‌భుత్వం  ఏపీలో వ‌రుస ప్రాజెక్టుల‌ను తీసుకొస్తూ  ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల కేంద్రంగా రాష్ట్రాన్ని మారుస్తోంది.  అందులో భాగంగా.. సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్ర‌బాబు  కలిసి శుక్రవారం ( మే 15)  శంఖుస్థాపన చేశారు.   పుట్టపర్తి సమీపంలోని గొల్లపల్లి వద్ద పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  నిర్మించనున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు వీరు పునాదిరాయి వేశారు.  యుద్ధ విమానాల విడిభాగాల తయారీ, అడ్వాన్స్‌డ్ రాడార్ సిస్టమ్స్, క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన కీలక పరికరాల ఉత్పత్తి ఇక్క‌డి నుంచి చేస్తారు.   ఈ యూనిట్ ఏర్పాటులో డీఆర్డీవో సాంకేతిక సహకారం అందిస్తోంది. పుట్టపర్తిలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయం, రక్షణ రంగ రవాణాకు, విమానాల టెస్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది.   ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా.  అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఇలాంటి  రక్షణ కేంద్రాలు శత్రువుల నిఘాలో ఉంటాయనీ, అందుకే వాటిని ఇక్కడ ఏర్పాటు చేయవద్దనీ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.  అయితే, ప్రభుత్వం   దేశ రక్షణకు అవసరమైన ఎస్-400 వంటి అత్యాధునిక రక్షణ కవచాలు ఇక్కడ ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది. ఇక  పుట్ట‌ప‌ర్తిలో జ‌రుగుతోన్న‌ శంఖుస్థాపన ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ హబ్‌గా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు ప‌డింద‌ని అంటున్నారు రక్షణరంగ నిపుణులు. దీంతో పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇప్పుడు పారిశ్రామిక కేంద్రంగానూ మారబోతోందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ రక్షణ, అంతరిక్ష రంగాలకు హబ్‌గా మారుతోంది. రాష్ట్రంలో ఉన్న ఈ కోవకు  ప్రధాన సంస్థలు ఏమిటన్నది ఒకసారి పరిశీలిస్తే.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-  , దేశంలోని ఏకైక అంతరిక్ష ప్రయోగ కేంద్రం. అలాగే బాపట్ల జిల్లాలోని నాగాయలంక వద్ద క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రం ఉంది.ఎన్ఎస్టీఎల్.. - విశాఖపట్నంలో ఉన్న ఈ సంస్థ నౌకాదళానికి అవసరమైన టార్పెడోలు, మైన్‌లను తయారు చేస్తుంది. విశాఖ‌లోని అచ్యుతాపురంలోనూ బార్క్ కు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులున్నాయి.   దేశంలో ఎక్కడ రక్షణ పరిశ్రమ పెట్టినా.. అది శత్రువుల నిఘాలో ఉంటుంది. అది పుట్టపర్తి అయినా, బెంగళూరులోని- హెచ్ఏఎల్ అయినా ఒకటే. అందుకే ఇలాంటి ప్రాంతాల వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో బలంగా ఉంటాయి. రక్షణ పరిశ్రమలు రావడం వల్ల.. వేల కోట్లలో పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పాకిస్థాన్ టార్గెట్ చేస్తుంది అని భయపడి పరిశ్రమలు పెట్టకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా దూరంలో ఉంది. ఉత్తర భారతం కంటే దక్షిణ భారతం ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమలకు ఎక్కువ సురక్షితమని రక్షణ నిపుణులు చెబుతున్నారు.  పేర్ని నాని వ్యాఖ్యలు ప్రధానంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కాకుండా రాజకీయ విమర్శల్లో భాగంగా చేసినవన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  సాంకేతికంగా, దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఇలాంటి పరిశ్రమలు రాష్ట్రానికి రావడం అభివృద్ధికి సంకేతం, అవ‌స‌రం కూడా అని అంటారు నిపుణులు.
ALSO ON TELUGUONE N E W S
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అద్భుత విజయాన్ని అందుకున్న విజయ్‌ను తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫోన్ ద్వారా పలకరించారు. ఇద్దరు అగ్ర హీరోల మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు చిరంజీవి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత లెజెండ్ ఎంజీఆర్ పాలనను చిరు గుర్తు చేశారు. ఎంజీఆర్ ఎలాగైతే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారో, విజయ్ కూడా అదే రీతిలో ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన సాగించాలని చిరంజీవి ఆకాంక్షించారు. మెగాస్టార్ ఆకాంక్షలకు సీఎం విజయ్ అంతే వినమ్రంగా స్పందించారు. చిరంజీవి తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, మెగాస్టార్ త్వరలో నటించబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ గురించి ప్రస్తావించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా భారీ విజయం సాధించాలని విజయ్ ఆకాంక్షించారు. కేవలం రాజకీయాలే కాకుండా సినిమాల గురించి కూడా వీరిద్దరూ ముచ్చటించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన ఇటీవలి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చూశానని, అందులో చిరు కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని విజయ్ మెచ్చుకున్నట్లు సమాచారం. సీఎంగా బిజీగా ఉన్నా కూడా సినిమాలపై విజయ్ చూపిస్తున్న ఆసక్తి అభిమానులను ఖుషీ చేస్తోంది. నిజానికి చిరంజీవికి, విజయ్ కుటుంబానికి మధ్య దశాబ్దాల కాలంగా మంచి అనుబంధం ఉంది. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ పాత జ్ఞాపకాలను, సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిరంజీవి స్వయంగా విజయ్‌కు ఫోన్ చేసి తన మద్దతును ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోన్ కాల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఉన్న పరస్పర గౌరవం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రస్థానానికి మెగాస్టార్ మద్దతు లభించడం తమిళ రాజకీయ వర్గాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం విజయ్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతుండగా, అటు చిరంజీవి తన తదుపరి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి కలయిక మరిన్ని సంచలనాలకు వేదికవుతుందేమో చూడాలి!
టాలీవుడ్ సీనియర్ నిర్మాత, సంక్రాంతి రాజుగా పేరుగాంచిన ఎం.ఎస్. రాజు అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఆయన నిర్మాణంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘వర్షం’ సినిమా గురించి ఎం.ఎస్. రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌తో ‘వర్షం’ సినిమా చేసే సమయంలో తనకి, ప్రభాస్‌కి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎం.ఎస్. రాజు స్పందించారు. ఆ సమయంలో ప్రభాస్ అడిగిన ఒక చిన్న ప్రశ్న తనని కొంత బాధించిందని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే అది పెద్ద గొడవ కాదని, ఒక క్రియేటర్‌గా తన అభిప్రాయానికి భిన్నంగా ప్రభాస్ మాట్లాడటంతో అలా అనిపించిందని చెప్పుకొచ్చారు. కానీ ఈ చిన్నపాటి మనస్పర్థలను తన భార్య చాలా చాకచక్యంగా చక్కదిద్దారని రాజు గారు వెల్లడించారు. ప్రభాస్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి గుర్తు చేస్తూ, కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకు ‘ఒక్కడు’ సినిమా ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో, కృష్ణంరాజు గారి అబ్బాయికి ‘వర్షం’ కూడా అలాంటి విజయాన్ని అందిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారట. దీంతో ఆ చిన్న అలకలు కాస్తా ఆవిరైపోయాయని ఆయన గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ డెడికేషన్ గురించి చెబుతూ ఎం.ఎస్. రాజు ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ తనని ఎంతగా నమ్మేవాడంటే.. "అబ్బాయి, ఇక్కడ దూకాలి అంటే ఏ మాత్రం ఆలోచించకుండా దూకేవాడు, డాన్స్ చేయమంటే చేసేవాడు" అని కొనియాడారు. వారి మధ్య ఒక నిర్మాత, నటుడి బంధం కంటే మించి తండ్రి కొడుకుల వంటి అనుబంధం ఉండేదని ఆయన తెలిపారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా, గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగినా తన దృష్టిలో మాత్రం ఆయన ఇంకా ఆనాటి ‘అబ్బాయి’ లాగే కనిపిస్తారని రాజు గారు చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో ప్రభాస్ చూపించిన అంకితభావమే అతడిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభాస్ ఎదుగుదల చూస్తుంటే ఒక తండ్రిగా తనకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ‘వర్షం’ వంటి బ్లాక్ బస్టర్ వెనుక ఇలాంటి ఎన్నో ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయని ఎం.ఎస్. రాజు మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సీనియర్ నిర్మాత తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో భవిష్యత్తులో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం 2026 జూలై 31న ఇండియా లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కొత్త పోస్టర్‌లో టామ్ హోలాండ్ పోషిస్తున్న పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపిస్తున్నాడు. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే భావాన్ని ఈ పోస్టర్ బలంగా ప్రతిబింబిస్తోంది. తన నగరాన్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్న స్పైడర్-మ్యాన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడని ఈ పోస్టర్ సూచిస్తోంది. స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్ ఘన విజయానికి నాలుగేళ్ల తర్వాత, ఈ చిత్రం పీటర్ పార్కర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని చూపించనుంది. ప్రపంచం తనను గుర్తించని పరిస్థితుల్లో ఒంటరిగా జీవిస్తున్న పీటర్, న్యూయార్క్ నగరాన్ని రక్షించడమే తన ధ్యేయంగా మారుతుంది. కానీ కొత్త నేరాల పరంపరతో పాటు అతని జీవితాన్ని కుదిపేసే శక్తివంతమైన శత్రువు రంగంలోకి దిగడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. సోనీ పిక్చర్స్ సంస్థ  ఇండియా  ఈ చిత్రాన్ని భారతదేశవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనుంది.
కోలీవుడ్ నుంచి మరో భారీ యాక్షన్ చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నటుడిగా మారుతూ, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'DC'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. (DC Trailer) ట్రైలర్ ప్రారంభం నుంచే అరుణ్ మాతేశ్వరన్ మార్క్ యాక్షన్, లోకేష్ కనగరాజ్ ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఇందులో లోకేష్ 'దేవదాస్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, వామిఖ గబ్బి 'చంద్ర' అనే గ్రే షేడ్ ఉన్న పాత్రలో మెరుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక రివెంజ్ డ్రామా అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా "మంచి అంటే చెడు.. చెడు అంటే మంచి" అనే కాన్సెప్ట్‌తో సినిమా సాగనుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, రక్తం చిందేలా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ నటన, బాడీ లాంగ్వేజ్ ఒక ప్రొఫెషనల్ నటుడిలా ఉండటం విశేషం. వామిఖ గబ్బి నటన కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన స్వరపరిచిన 'రాగ ఆఫ్ రివెంజ్' సాంగ్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ తనదైన శైలిలో రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో ఆకట్టుకున్నారు. ట్రైలర్‌లో డైలాగులు తక్కువగా ఉన్నప్పటికీ, విజువల్స్ ద్వారా కథలోని గాఢతను చెప్పే ప్రయత్నం చేశారు. లోకేష్ కనగరాజ్ అభిమానులు ఆయనను నటుడిగా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి 'DC' ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మెప్పిస్తాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.  
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. ఆ డైలాగ్స్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ మాస్ మేనరిజం వెండితెరపై సృష్టించే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే, గత కొంతకాలంగా ఆయన ఫామ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పూరీ నుండి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదే 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్'. టైటిల్ వినగానే ఏదో కొత్తగా ఉందే అనిపిస్తోంది కదూ? అవును, పూరీ ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథాంశం ఒక మురికివాడ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. పూరీ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎమోషనల్ గా, రియలిస్టిక్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పూరీ సినిమాల్లో హీరోలు ఆటిట్యూడ్ తో అదరగొడుతుంటారు, కానీ ఇందులో మాత్రం మట్టి మనుషుల జీవితాలను, వారి పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారట. మురికివాడలో నివసించే వారి ఆశలు, ఆశయాలు మరియు వారు ఎదుర్కొనే సవాళ్లను '33 టెంపుల్ రోడ్' అనే అడ్రస్ ద్వారా ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పట్ల పూరీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులను స్పీడప్ చేశారని తెలుస్తోంది. సినిమా మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే, పూరీ తన మార్కు మాస్ ఎలిమెంట్స్‌ను మిస్ చేయకుండానే, కథలో ఒక గాఢతను జోడించారట. గ్రాఫిక్స్ కంటే కూడా నేచురల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పూరీ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. స్లమ్‌డాగ్ అనే పదం ఉండటంతో ఇది గ్లోబల్ అప్పీల్ ఉన్న కథేమో అనే అంచనాలు కూడా ఉన్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెకు హత్తుకునే సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ కానున్నాయి. మరోవైపు, ఈ సినిమాలోని నటీనటుల వివరాలను మేకర్స్ చాలా గోప్యంగా ఉంచుతున్నారు. పూరీ జగన్నాథ్ తన సొంత నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం, ఎడిటింగ్ విభాగాల్లో కూడా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు టాక్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో, త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉంది. పూరీ రాసిన సంభాషణలు ఈసారి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని, సమాజంలోని అంతరాలను ప్రశ్నించేలా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి. పూరీ మార్క్ మేజిక్ కోసం ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అవుతుందని ఆశిద్దాం.
Lokesh Kanagaraj makes a strong impression in front of the camera, proving his acting abilities are spot on for a gritty lead role. Sharing the screen, Wamiqa Gabbi is equally compelling, delivering a grounded performance that anchors the emotional weight of the film. The story offers a different take on the classic Devdas romance, introducing a Chandramukhi-like twist where both characters actively choose each other to survive. The core premise revolves around these two downtrodden individuals taking a stand against system-based officers, triggering a massive police pursuit. Thematically, this narrative setup feels akin to Adivi Sesh's Dacoit, dealing with rebels going against the grain. However, the visual aesthetic is entirely different. Director Arun Matheswaran stays true to the grim style of his earlier films, Captain Miller and Rocky. He once again delivers an unapologetic, high-violence, blood-bath movie with raw and intense cinematography. Driving this on-screen chaos is the standout work of Anirudh Ravichander, who has outdone his recent albums with a highly experimental score. He seamlessly amalgamates traditional Hindustani classical music with modern-day, high-octane electronic beats. This unique blending of contrasting genres drives the trailer's pacing, providing a rhythmic intensity that perfectly frames the action.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చరణ్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల బయటపెట్టారు. సాధారణంగా దర్శకులు ఏసీ రూముల్లో కూర్చుని కథలు రాస్తుంటారు, కానీ బుచ్చిబాబు మాత్రం తన గురువు సుకుమార్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్న వెంటనే పిఠాపురం వెళ్లారు. అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని ఈ సినిమా పూర్తి కథను, స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. దైవ సన్నిధిలో పుట్టిన ఈ కథలో ఒక తెలియని శక్తి ఉందని, చరణ్ కూడా ఈ కథ వినగానే ఒక్క మార్పు కూడా చెప్పకుండా వెంటనే ఓకే చేశారని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక విలేజ్ బాడీ లాంగ్వేజ్‌తో, పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఆయన 'పెద్ది పహిల్వాన్'గా కుస్తీ పోటీల్లో చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు ఒక అత్యంత కీలకమైన మరియు డిఫరెంట్ విలన్ రోల్ పోషిస్తున్నారు. తన కెరీర్‌లోనే ఇలాంటి పాత్రను ఊహించలేదని జగ్గుభాయ్ చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మే 18న ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి (Saptagiri) గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రభాస్ 'రాజా సాబ్' (Raja Saab) గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడమే కాకుండా, పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి, ఈ వివాదంపై స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు కోరారు. సప్తగిరి అసలు ఏం మాట్లాడారంటే.. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న సినిమాల గురించి చెబుతూ, తను చేస్తున్న చిన్న బడ్జెట్ సినిమాల లిస్టులో పొరపాటున 'రాజా సాబ్' పేరును కూడా చేర్చారు. పాన్ ఇండియా లెవల్లో వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రభాస్ సినిమాను 'చిన్న సినిమా' అనడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై సప్తగిరి క్లారిటీ ఇస్తూ, "నేను కొన్ని మినిమం బడ్జెట్ సినిమాలు చేస్తున్నాను, వాటిలో నాకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయని చెబుతూ.. ఫ్లోలో రాజా సాబ్‌ను కూడా ఆ లిస్టులో చేర్చాను. అది నిజంగా పొరపాటే, అందుకు రియల్లీ సారీ. మారుతి గారు కూడా నాకు ఫోన్ చేశారు, ఆయనకు కూడా నేను క్షమాపణలు చెప్పాను" అని వివరించారు. తాను ప్రభాస్ సినిమాను చిన్న సినిమా అని ఉద్దేశపూర్వకంగా అనలేదని, కేవలం మాటల మధ్యలో దొర్లిన తప్పు మాత్రమేనని సప్తగిరి స్పష్టం చేశారు. మారుతి గారు ఫోన్ చేయగానే వెంటనే రియలైజ్ అయ్యానని, మీడియా ముఖంగా మరోసారి క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. 'రాజా సాబ్'ను చిన్న సినిమా అనడంతో సోషల్ మీడియాలో సప్తగిరిపై ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.  
కన్నడ చిత్ర పరిశ్రమలో 'ఛాలెంజింగ్ స్టార్' గా, 'డి బాస్' గా వెలుగొందుతున్న నటుడు దర్శన్ తూగుదీప జీవితం ఇప్పుడు చీకటి కోణంలో కూరుకుపోయింది. తన వీరాభిమాని అయిన రేణుకాస్వామి అనే యువకుడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌కు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ‌ తగిలింది.  కర్ణాటక హైకోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అటువంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న వ్యక్తి బయట ఉండటం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే దర్శన్‌ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో ఆయన మరోసారి జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.   ఈ విషాదకరమైన కథ గతేడాది జూన్‌లో ప్రారంభమైంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే ఫార్మసీ ఉద్యోగి, దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆగ్రహంతో ఈ ఘాతుకానికి తెరలేచింది. దర్శన్ అనుచరులు రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు కిడ్నాప్ చేసి, ఒక షెడ్డులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే, దర్శన్ స్వయంగా ఆ బాధితుడిపై దాడి చేశారని, విద్యుత్ షాక్‌లు ఇచ్చి కిరాతకంగా చంపేశారని ఆరోపణలు ఉన్నాయి.  ఒక సూపర్ స్టార్ హోదాలో ఉన్న వ్యక్తి, తనను దైవంగా భావించే అభిమానిని ఇంత దారుణంగా అంతమొందించడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.  కోర్టు విచారణలో భాగంగా దర్శన్ అనారోగ్య కారణాలను చూపుతూ మధ్యంతర బెయిల్ పొందారు. వెన్నునొప్పి సమస్యతో చికిత్స కోసం ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే, దర్శన్ బయట ఉంటే కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉందని, సాక్షులు భయభ్రాంతులకు గురవుతారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  వాదనలు విన్న సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపడుతూ దర్శన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విచారణలో పురోగతి లేకపోతే ఏడాది తర్వాత మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నించవచ్చని పేర్కొంటూనే, ప్రస్తుతానికి జైలుకే వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశలు మళ్ళీ చిగురించాయి. మరోవైపు, సినిమా షూటింగ్‌లు ఆగిపోయి, నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నా, చట్టం ముందు అందరూ సమానమే అని ఈ తీర్పు నిరూపించింది. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ్‌ స‌ర్జా, దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్‌లో రూపొందిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'కేడి (KD) - ది డెవిల్'. నేడు (మే 15) ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. (KD The Devil Movie Review) కథ: 1970-80ల నాటి బెంగళూరు నేపథ్యంలో సాగే కథ ఇది. కాళిదాస్ అలియాస్ కాళి (ధ్రువ్‌ స‌ర్జా) సాధారణ జీవితం సాగిస్తుంటాడు. 25 ఏళ్లుగా ఓ ముఠా నాయ‌కుడిగా కొనసాగుతున్న దేవా (సంజ‌య్‌ద‌త్‌) అంటే కాళికి చాలా ఇష్టం. అనుకోకుండా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా.. కాళిని, అతని కుటుంబాన్ని మ‌ట్టుబెట్టాల‌ని దేవా గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. అప్ప‌టివరకు దేవాను ఎంతో ఆరాధిస్తూ తిరిగిన కాళి.. త‌న కుటుంబం కోసం ఆయుధం పట్టి, దేవాకు ఎదురునిలబడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: సింపుల్ గా చెప్పాలంటే.. దేవాను ఆరాధించే స్థాయి నుంచి అతనికి సమానంగా నిలబడే స్థాయికి కాళీ ఎలా ఎదిగాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ తరహా అండర్ వరల్డ్ కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం ప్రధాన మైనస్ గా మారింది. దర్శకుడు ప్రేమ్ కేవలం హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌పైనే దృష్టి పెట్టారు తప్ప, బలమైన ఎమోషన్స్ పండించడంలో తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ కాస్త ఆసక్తికరంగా ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా ఊహించదగ్గ రీతిలో ఉంటుంది. 1970ల కాలం నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథ.. అప్పటి మాస్, క్రైమ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు యాక్షన్ ప్రియులకు కావాల్సిన విందును దర్శకుడు అందించారు. ధ్రువ సర్జా, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకున్నాయి. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి, భారీ యాక్షన్ కోరుకునే వారికి 'కేడీ: ది డెవిల్' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: మాస్ హీరోగా ధ్రువ సర్జా తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో తన ఎనర్జీని ప్రదర్శించాడు. రీష్మా నానయ్య హీరోయిన్‌గా తన పరిధి మేర చక్కగా నటించింది. సీనియర్ నటుల ఉనికి సినిమాకు ఒక లెవల్ క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా సంజయ్ దత్ తన గంభీరమైన నటనతో మెప్పించారు. శిల్పా శెట్టి చాల కాలం తర్వాత ఒక బలమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ 70-80ల నాటి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. అర్జున్ జన్యా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఆ కాలానికి తగ్గట్లుగా సహజంగా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్: ధ్రువ సర్జా పర్ఫార్మెన్స్ టెక్నికల్ వాల్యూస్ మైనస్ పాయింట్స్: రొటీన్ కథనం ఓవర్ బిల్డప్స్ సెకండ్ హాఫ్ ఫైనల్ గా.. 'కేడి - ది డెవిల్' కేవలం మాస్ యాక్షన్ ప్రియులను మాత్రమే టార్గెట్ చేసిన సినిమా. ఓవర్ ది టాప్ యాక్షన్, రొటీన్ మాఫియా డ్రామా కావాలనుకునే వారు ఒకసారి చూడొచ్చు. కానీ, కథలో లోతును ఆశించే ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగిస్తుంది. Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే.. పాత బంధాల ప్రస్తావన.. కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది. కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం.. పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఫిర్యాదులు.. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి. స్వేచ్ఛ.. పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.                               *రూపశ్రీ.
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా మూత్రపిండాలు క్రమంగా దెబ్బతింటాయి. నేటికాలంలో ఆహారపు అలవాట్లు,  తీసుకునే పానీయాలు,  జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. గతంతో పోలిస్తే.. నేటికాలంలో మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువ అయ్యారు. మూత్రపిండాల పనితీరు బలంగా ఉండాన్నా,  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని అలవాట్లు చాలా బాగా సహాయపడతాయి.   రోజువారీ జీవితంలో పాటించదగిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. నీరు.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం చాలా సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. నీరు మూత్రం ద్వారా శరీరం నుండి విషపదార్థాలను , అదనపు ఉప్పును బయటకు పంపడానికి సహాయపడుతుంది. చాలా తక్కువ నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు , మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడానికి దారితీస్తుంది. సగటు వ్యక్తికి రోజుకు 2–3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.  ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉప్పు.. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్, ఊరగాయలు , ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు అధికంగా ఉంటుంది.   ఉప్పు తక్కువగా తీసుకునేందుకు  ప్రయత్నించాలి. అలాగే  తాజాగా, ఇంట్లో వండిన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం మూత్రపిండాలపై భారాన్ని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జంక్ ఫుడ్.. జంక్ ఫుడ్‌లో అధికంగా నూనె, ఉప్పు, చక్కెర  ఉంటాయి, ఇవి క్రమంగా శరీరానికి , మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు , మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు ,  ఇంట్లో వండిన పోషకాలతో కూడిన  భోజనం తినడం ఉత్తమం. ధూమపానం.. ధూమపానం శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీసి, మూత్రపిండాలకు తగినంత రక్త సరఫరాను అడ్డుకుంటుంది. సిగరెట్లలోని విష పదార్థాలు క్రమంగా మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తాయి. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం ఆపేయడం వల్ల  గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక శరీరాన్ని చురుకుగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది , రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా నడవడం మధుమేహం , ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎక్కువ కాలం  మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.                            *రూపశ్రీ.
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో తల తిరగడం సమస్యకు మన ఇంట్లో ఉండే ధనియాలతో (Coriander Seeds) సులభమైన మరియు ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు: తల తిరగడానికి కారణాలు: అసలు వెర్టిగో లేదా తల తిరగడం ఎందుకు వస్తుంది? ధనియాల ప్రాముఖ్యత: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు శరీరంలోని వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుస్తాయి? రెమెడీ తయారీ విధానం: ధనియాలను ఏ విధంగా ఉపయోగిస్తే తల తిరగడం తక్షణమే తగ్గుతుంది? ముందు జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి: సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!