ఐకమత్యానికి నిదర్శనం గణేష్ ఉత్సవ్.. గవర్నర్ తమిళిసై
Publish Date:Aug 31, 2022
Advertisement
రాష్ట్రగవర్నర్ తమిళిసై ఖైరతా బాద్ మహాగణపతిని దర్శించు కుని తొలి పూజ చేశారు. గణేషు ని దర్శనానికి వచ్చిన జనసందో హాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, అందరి ఐకమత్యానికి ఈ పం డుగ గొప్ప నిదర్శనమని అన్నా రు. అందరికీ వినాయక చవితి శుభా కాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మిగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శన మిస్తు న్నారు. తొలిసారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో మహా గణ పతి దర్శనానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి మొదలు కావడంతో ఆ ప్రాంతంలో పోలీసు లు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రదాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి. ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈసారి భారీభద్రత సెక్యూరిటి వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహి స్తున్నారు. క్రైమ్ టీమ్స్, షీటీమ్స్, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్ రంగంలోకి దిగాయి. అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని వెల్ నెస్ సెంటర్ హాస్పిటల్లో సెంట్రల్ జోన్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసందానం చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి ని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ఘనంగా చేయమని ఆదేశాలు ఇచ్చారన్నారు. బోనాలు, బతుకమ్మ, గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో ఘనంగా చేస్తున్నామని తెలిపారు. అన్ని పండుగలు నిధులు మంజూరు చేసి పండుగలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ గణేష్‌ను మట్టితో తయ్యారు చేసి అందరికి ఆదర్శం నిలిచారని అన్నారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/ganesh-utsav-is-a-demonstration-of-unity-governor-tamilisee-25-142979.html





