జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటెషన్‌పై పిటిషన్ కొట్టివేత
Publish Date:Dec 22, 2025
Advertisement
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 7 కార్పోషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. వార్డుల విభజను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంసీహెచ్‌ఆర్‌డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని తెలంగాణ సర్కార్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. చట్టపరిధిలోనే వార్డుల విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ బుధవారమే కోర్టుకు వివరించారు.
http://www.teluguone.com/news/content/ghmc-wards-delimitation-36-211422.html





