Publish Date:Dec 22, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.
ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/national-herald-case-36-211395.html
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది.
2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు.
హైదర్‌నగర్ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలో శ్రీవారి ఆలయన్ని మూసివేయనున్నట్లు తెలిపారు
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీ అంతర్జా తీయ విమానాశ్రయంలో 2.1 కిలోల కోకైన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది.
వివాహేతర సంబంధానికి అడ్డువస్తు న్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది.