Publish Date:Feb 21, 2026
మాజీ ఎంపీ బుట్టా రేణుక , ఆమె భర్త నీరుకర్ శివ ప్రసాద్‌కు చెందిన ఆస్తుల ఈ-వేలం ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో తీసుకున్న భారీ రుణాన్ని చెల్లించకపోవడంతో ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ రంగంలోకి దిగింది. బకాయిల వసూళ్ల కోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎ స్పందన లేకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది.
ఆ సంస్థ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, బుట్టా రేణుక దంపతులు ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.340 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ప్రారంభంలో కొంతకాలం వరకూ వాయిదాలు చెల్లించినా ఆ తరువాత చెల్లిం పులు నిలిపివేశారు. దీంతో వడ్డీలు, పెనాల్టీలు కలసి మొత్తం బాకీ రూ.782.07 కోట్లకు చేరింది. దీంతో రుణానికి భద్రతగా పెట్టిన ఆస్తులను విక్రయించి బకాయిలను వసూలు చేసుకునేందుకు సంస్థ చర్యలు ప్రారంభించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ బెంగళూరు శాఖ పరిధిలోని సర్వే నంబర్ 1009, ఫేజ్–6లో ఉన్న 3,833.28 చదరపు గజాల స్థలాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించ నున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ స్థలంలో మెరిడియన్ పాఠశాల భవనం ఉండటం గమనార్హం. సంబంధిత ఆస్తి విలువను రూ.65 కోట్లుగా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.ఈ-వేలంలో పాల్గొనదలిచిన వారు మార్చి 23లోగా ఈ-బిడ్ దరఖాస్తులు సమర్పించాలనీ, మార్చి 24న ఈ-వేలం నిర్వహిం చనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వేలం ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. మాజీ ఎంపీకి చెందిన ఆస్తుల ఈ-వేలం వ్యవహారం కర్నూలు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుండ గా, అనంతరం మరిన్ని ఆస్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయంపై మాజీ ఎంపీ నుంచి స్పందన రావాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mp-butta-renuka-assets-to-be-auctioned-on-march-24-36-214427.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.