Publish Date:Feb 20, 2026
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టీ.జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, దీంతో ఆసుపత్రికి తరలించామనీ కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.
73 ఏళ్ల వయస్సులో ఆ సీనియర్ సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. వాతావరణ పరిస్థితుల మార్పు, ఎన్నికల్లో అవిశ్రాంతంగా తిరగడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే సంజయ్ వర్గం, జీవన్ రెడ్డి వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి సంజయ్ వర్గానికి ఛైర్మన్ పదవి, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి కేటాయించింది. దానిపై జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-jeevanreddy-unwell-36-214378.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.