ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ విద్యాభ్యాసం పట్ల తన ఆసక్తిని చాటుతూ TG LAWCET-2026లో ఉత్తీర్ణత సాధించారు. 120 మార్కులకు 57 మార్కులు సాధించిన ఆయన 349వ ర్యాంక్ పొందారు. మావోయిస్టు ఉద్యమంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన దేవ్ జీ, ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే... ఈ నేపథ్యం లోనే లాయర్ కావాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలనే సంకల్పం తో చదువును కొనసాగించారు.
పదో తరగతి వరకే విద్యాభ్యాసం చేసిన ఆయన ఇటీవల ఇంటర్మీడి యట్ పరీక్షలు రాయడమే కాకుండా, అనంతరం TG LAWCET ప్రవేశ పరీక్షకు హాజరై విజయాన్ని అందుకు న్నారు. విద్యకు వయసు అడ్డుకా దని, లక్ష్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాధించ వచ్చని దేవ్ జీ తాజా విజయం మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు గత కొద్ది రోజులు గా అనారోగ్యంతో బాధపడు తున్న దేవ్ జీ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆయనను పరామర్శిం చారు. దేవ్ జీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్న ఆమె, వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. దేవ్ జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-maoist-dev-ji-tops-lasat-36-221991.html
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్‌బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
1999లో ఒక రైతు కుటుంబం పార్కు కోసం కేవలం 10 డాలర్లకే 87 ఎకరాల భూమిని ఇస్తే, టేలర్ నగరం దాన్ని 10 మిలియన్ డాలర్లకు డేటా సెంటర్ నిర్మించడానికి అమ్మేసింది. ఈ గుండె బరువెక్కించే పూర్తి కథనం చదవండి.
చాట్‌జీపీటీ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు ఓపెన్ఏఐ శ్రీకారం చుట్టింది. కేవలం చాటింగ్ చేసే రోజులకు కాలం చెల్లిందంటూ చాట్‌జీపీటీని సరికొత్త సూపర్ యాప్గా మారుస్తున్నారు. ఈ సంచలన మార్పుల వెనుక ఉన్న పూర్తి వివరాలు, కొత్త ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రాథమికంగా తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎక్కడైనా రోడ్డుపై పెద్ద గుంతలు, అంటే ప్రయాణానికి ఇబ్బంది కలిగించే గతుకులు, గుంతలను గమనిస్తే, వెంటనే వాటి ఫోటోలను తీసి, పూర్తి సమాచారంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎలోన్ మస్క్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) తన మోస్ట్ అవేటెడ్ ఐపీఓ (IPO) తో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. జూన్ 12 నుంచి షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుండగా.. షేర్ ధర, వాల్యుయేషన్, ఇన్వెస్టర్ల కోటా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వైజాగ్‌కు చెందిన తెలుగు విద్యార్థి అక్షత్ శ్రీవాస్తవ ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026 విజేతగా నిలిచి, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిశాడు. అతను రూపొందించిన AI ఎడ్యుకేషన్ యాప్ STEMQuest వివరాలు, WWDC ఈవెంట్ విశేషాలు మరియు అతని సక్సెస్ స్టోరీని ఇక్కడ చూడండి.
15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్ బ్రయాన్ లారా, గ్యారీ సోబర్స్‌ను గుర్తుచేస్తోందని, అతని 72 సిక్సర్ల విధ్వంసంపై మెక్‌గ్రాత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 26 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. భారతీ ఫుల్మాలి (56*) హాఫ్ సెంచరీతో మెరవగా, శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
సోమవారం మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది.
ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.
సాంకేతిక లోపంతో వల్ల ఒక భారీ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో.. అదే సమయంలో వెనుక నుంచి కార్మికులతో వస్తున్న ఒక మినీబస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. కార్మికుల బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం, వేగాన్ని నియంత్రించలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.