ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తాజాగా భారత్ న్యాయ వ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ ముఖ్య నేతలపై విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. లలిత్ మోడీ 2010లో భారత్ నుంచి లండన్ కి పరారయ్యారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కేటాయింపు బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్ సహా ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మోడీ సర్కారు ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కేసుల్లో ఉన్న ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. ఆ నేరస్తుల జాబితాలో లండన్ పరారైన లలిత్ మోడీ, విజయ్ మాల్యా పేర్లు కూడా ఉన్నాయి.
అలాంటి లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాను పరారీలో ఉన్నానని అనడాన్ని తప్పు పడుతూ.. లండన్ నుంచి భారత్‌కు తిరిగి రావడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. భారత చట్టాలంటే భయం లేదని, అయితే భారతీయ న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారానికి చాలా సమయం పడుతుందని లాజిక్‌లు చెప్తున్నారు. 17 ఏళ్లుగా నన్ను కోర్టుకు తీసుకెళ్లలేదని, ఇప్పుడు ఎలా అరెస్టు చేయగలరని వితండ వాదం చేస్తున్నారు.
లండన్‌లో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ మాట్లాడుతూ.. తనను నిర్దోషిగా నిరూపించుకోవాలని అనుకున్నప్పుడే భారత్ వచ్చి కేసులు ఎదుర్కొంటానని ఆప్షన్‌లు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరాన్ని లలిత్ మోడీ టార్గెట్ చేశారు. క్రికెట్ ఉన్న ఆదరణ కారణంగా తన పేరు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు.
ప్రజలను ప్రభావిత చేయడానికే ఎన్నికల సమయంలో, పార్లమెంటులో తన పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారత్ ప్రభుత్వానికి నిజంగా తనను పట్టుకోవాలని ఉంటే ఎప్పుడో పట్టుకునేదని, పరారీలో ఉన్నానని జరుగుతున్న ప్రచారం అంతా మీడియా సృష్టని లలిత్ మోడీ అంటుండటం.. తనను ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 17 ఏళ్లుగా యూకేలో నివస్తిస్తూ.. 2010లో తనపై అభియోగాలు మోపిన అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని పెద్దలు రాహుల్, చిదంబరంలపై లలిత్ మోడీ ఆరోపణలు చేస్తుండటం ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి? అన్న చర్చ మొదలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/financial-criminal-lalit-modi-36-221993.html
15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్ బ్రయాన్ లారా, గ్యారీ సోబర్స్‌ను గుర్తుచేస్తోందని, అతని 72 సిక్సర్ల విధ్వంసంపై మెక్‌గ్రాత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 26 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. భారతీ ఫుల్మాలి (56*) హాఫ్ సెంచరీతో మెరవగా, శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
సోమవారం మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది.
ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.
సాంకేతిక లోపంతో వల్ల ఒక భారీ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో.. అదే సమయంలో వెనుక నుంచి కార్మికులతో వస్తున్న ఒక మినీబస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. కార్మికుల బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం, వేగాన్ని నియంత్రించలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
సిరి కేవలం ఒక కమాండ్ ఫాలో అయ్యే టూల్‌లా కాకుండా.. అత్యంత సహజంగా సంభాషించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని యాపిల్ ఇక్కడ కూడా కొనసాగించింది. డేటా అంతా డివైస్ లోపలే ప్రాసెస్ అయ్యేలా డిజైన్ చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.