Publish Date:Feb 22, 2026
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను జూన్ 30 వరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటివరకు కొనసాగనున్న సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఆయన కేసు నమోదైన విషయం తెలిసిందే.
అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలున్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన క్రైమ్ నం.187/2024 దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం ఉండటంతో సస్పెన్షన్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-cid-chief-sunil-kumar-suspended-36-214492.html
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.