మీ కోసం....మీరు ఉన్నారా??

Publish Date:Mar 26, 2022

Advertisement

ప్రతి మనిషి జీవితంలో బతకడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఇది ఒక వర్గం అయితే చాలామంది కొన్ని లక్ష్యాలు, కొన్ని కలలు అంటూ వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇల్లు, పనిచేసే చోటు, ప్రయాణం చేసే చోటు, బంధువులు కలిసే కార్యక్రమాలు, పరిచయస్తులు పార్టీలు, ఫంక్షన్ లు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జీవితాల్లో భాగంగా ఉంటాయి. అయితే అలాంటివి జరిగే ప్రతిచోటా మనిషి ఎదుటివాళ్లను గమనిస్తూ ఉంటారు. వాళ్లలో ప్రత్యేకత, వాళ్లలో బలహీనత, వాళ్ళ బలం ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు.


అంటే మనిషి తన జీవితంలో తన రోజువారీ పనులలో మునిగిపోయి, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలలో ఎదుటివారిని చదువుతూ, ఇంకొకరి గురించి తెలుసుకుంటూ బతికేస్తున్నాడు అనే విషయం గమనిస్తే తప్ప అర్థమవ్వదు. కానీ ప్రతి మనిషి చెయ్యాల్సిన పని ఒకటుంది.  అదే తమ గురించి తాము తెలుసుకోవడం. ఇది ఒకరకంగా ఆత్మ విమర్శ లాంటిదే అనుకోవచ్చు. మరి ఇందులో ఏముంటుంది??


ప్రాధాన్యతలు!!


మీరు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు?? అవి మీ ఇష్టాఇష్టాలకు ఎంతమాత్రం సరోపోతున్నాయి. నిజంగానే ప్రాధాన్యతలన్నీ పూర్తి సంతృప్తిగా ఉన్నాయా?? లేక ఆర్థిక కోణం చూసి వాటిని ప్రాధాన్యతలుగా మార్చుకున్నారా?? మనిషి జీవితంలో ఎన్నో ఉండచ్చు కానీ తనకు కాసింత తృప్తినిచ్చే వాటిని వదిలేసుకోకూడదు కదా. చాలామంది అదేదో చిన్నతనం అనే ఫీలింగ్ తో కొన్ని తృప్తికరమైన వాటిని వదిలేసుకుంటారు.


బలాలు, బలహీనతలు!!


మనిషిలో ఉన్న మానసిక జీవితంలో బలాలు, బలహీనతలే బలగాలు. బలం మనిషి పట్టు అయితే బలహీనత మనిషిని వెనక్కులాగేది అవుతుందని అనుకుంటారు కానీ మీకు తెలుసా బలహీనతలు ఉన్నవాడే గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. బలహీనతను బలంగా మార్చుకోవడం, ఆ బలహీనతపై పై చెయ్యి సాధించడం, దానిని అధిగమించడం దీని వల్ల సాధారణ బలం కంటే ఎన్నోరెట్ల ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది.


ప్రవర్తన!!


ఇక్కడ ప్రతి మనిషి తన మెంటాలిటీని బట్టి ప్రవర్తన అంటే ఇలా ఉండాలి అని ఒక వివరణ ఇస్తాడు. అయితే అందరి విషయానికి సరిపోదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి. అందుకే ప్రవర్తన అనేదానికి ఒక ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఇవ్వలేము. ఇంకా దాని మీద విభిన్న వాదనలను కూడా చూస్తుంటాము. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం కాసింత సాటిసిఫాక్షన్ ఉండాలి. కారణాలు ఎన్నైనా ఉండచ్చు కానీ ఒకరిని పలకరించడం, ఒకరు పలకరించినపుడు స్పందించడం. నలుగురిలో మాట్లాడినప్పుడు హుందాతనం, పెద్దల విషయంలో కాసింత గౌరవం, చిరునవ్వుతో పలకరించడం. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. మీరు ఒకరిని గమనిస్తున్నట్టు, మిమ్మల్ని వేరే వాళ్ళు గమణిస్తుంటారు అనే విషయాన్ని మరచిపోకూడదు.


మీకోసం మీరు!!


మీకోసం మీరు కొంచమైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని కాస్త ఆలోచించాల్సిందే. ప్రస్తుత కాలంలో మనిషుల్లో frustration  పెరిగిపోవడానికి కారణం ఎవరికి వారు లేకుండా పోవడమే. అంటే మీకోసం మీరు కొంచమైనా ఉండాలి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వృత్తి, బయటకు వెళ్తే స్నేహితులు, సన్నిహితులు వీళ్ళందరి కోసం ఇష్టం లేనివాటిని భరించేస్తూ ఉండటం వల్ల అసహనం ఎక్కువైపోతుంది. కనీసం అలా ఏదైనా చిన్న షాప్ కు వెళ్లి నచ్చిన టీ తాగుదామా అంటే అక్కడే ఎవరో ఒకరు ఆత్మీయులు కనబడి అధోద్దు ఇది బాగుంటుంది అని నచ్చనిది చేతికిచ్చి తాగమన్నట్టు, ఎంతమందికి ఎన్ని సమకూర్చినా మీ విషయంలో మీకు నచ్చిన దేన్నీ మార్చుకోవద్దు. హాయిగా మీదైన ఇష్టాన్ని ఆస్వాదించాలి. అప్పుడే కాసింత తృప్తి లభిస్తుంది. అది చిన్నపుడు తిన్న పుల్లైసులాంటిది.


                                                                                                             ◆వెంకటేష్ పువ్వాడ.

 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.