పిలవని పేరంటానికి వచ్చారో.. ఖబడ్దార్!
Publish Date:Mar 16, 2026
Advertisement
అతిథి దేవోభవ అన్న మాటకు కాలం చెల్లిందా? పిలిచినా పిలవకున్నా వచ్చిన వారికి అన్నంపెట్టి ఆదరించే లక్షణం ఇక ఔట్ డేటెడ్ అయిపోయిందా? అంటే ఔననే అంటారు.. భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూస్తే. గతంలో ఎన్నడూ చూడని విధంగా పిలవని పేరంటానికి రాకండి అంటూ ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిలవని ఫంక్షన్‌కు వెళ్లి భోజనం చేస్తే భారత శిక్షాస్మృతి ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న హెచ్చరిక కూడా ఆ ఫెక్సీలో ఉంది. భారత సంస్కృతిలో ఆకలితో ఉన్నవారికి పెట్టడం పుణ్యం. అలాగని పిలవని పేరంటానికి వెళ్లి పెళ్లి భోజనం చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం. దీంతో పిలువని వ్యక్తులు ఫంక్షన్‌కు వెళ్లి ఆ ఫంక్షన్ నిర్వహిస్తున్న వారికి ఆర్ధిక భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇండయన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 441ను పొందుపరిచారు. ఆ సెక్షన్ ప్రకారం ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు సదరు ఫంక్షన్ కు వచ్చి పట్టుబడితే, 3 నెలల జైలుశిక్ష, ఐదు వేల రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ విషయం, ఈ సెక్షన్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. తాజాగా భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఈ సెక్షన్ ను పేర్కొంటూ.. పిలవని పేరంటానికి వచ్చి జైలు, జరిమానాకు గురి కాకండి అని హెచ్చరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఫంక్షన్ హాల్స్‌లో ప్లేట్ల లెక్కన క్యాటరింగ్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/flexi-caution-dont-attend-function-without-invitation-36-215555.html





