గచ్చిబౌలిలో లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి

Publish Date:May 13, 2026

Advertisement

 

గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న మాహి ఉమెన్స్ పీజీ భవనంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారి గ్రిల్స్ ఉన్న లిఫ్ట్‌లో చిక్కుకుపోయి మృతి చెందడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. జార్ఖండ్‌కు చెందిన బిస్తు సేఫ్‌గా బాలిక తన  తాత, అమ్మమ్మలతో కలిసి గచ్చిబౌలిలోని ఈ పీజీ హాస్టల్‌లో నివసిస్తున్నది. కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి లిఫ్ట్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆడుకుంటూ లిఫ్ట్‌లోకి వెళ్లిన చిన్నారి గ్రిల్ మధ్య ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయింది.

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలికను గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. తలుపులు తెరిచి బయటకు తీసేలోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగి పోయింది. చిన్నారి తాత, అమ్మమ్మలు తీవ్ర షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. లిఫ్ట్ నిర్వహణ, భవన భద్రతా ప్రమాణాలు, పీజీ నిర్వాహకుల నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులెవరు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. గచ్చిబౌలిలో జరిగిన ఈ విషాదం చిన్నారుల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది.


 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్)..
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
బినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్‌ బ్రిడ్జిలు రానున్నాయి.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.