చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
Publish Date:Mar 13, 2026
Advertisement
హైదరాబాద్ చందానగర్ లోనొ ఓ ఫర్నీచర్ గోడౌన్ లో బుధవారం (మార్చి 12)అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్రిప్రమాదం సంభవించింది. అను ఫర్నిచర్ & ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఐదు అంతస్తుల భవనంమొత్తం మంటలు వ్యాపించాయి. 8 ఫైర్ ఇంజన్లతో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. గోదాం మొత్తం ఫర్నిచర్ సామగ్రితో నిండివుండటం తో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. స్థాని కుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అన్న విషయం వెంటనే తెలియరాలేదు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఈ గోదాంలో ఎవరైనా ఉన్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/fire-accident-in-chandanagar-36-215398.html





