బ్రెయిన్ ఫాగ్.. గందరగోళంగా ఉంటూ విషయాలన్నీ మర్చిపోతుంటారా?  అయితే మీ సమస్య ఇదే కావచ్చేమో..!

Publish Date:Jun 29, 2026

Advertisement

 

ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు.

తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే..

బ్రెయిన్ ఫాగ్..

బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు.

వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు.


బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది?


తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది.

బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి?

బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి.

చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు.

కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.

ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.

ఇవి కూడా తెలుసుకోవాలి..

మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి.

బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం.

వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

                                    *రూపశ్రీ.

By
en-us Political News

  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు.
అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై Best Before,Use By, Expiry Date వంటి పదాలు కనిపిస్తుంటాయి,చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.