పత్యం ఆహారంలో వంకాయ తినకూడదని అంటారు ఎందుకు...
Publish Date:Sep 2, 2026
Advertisement
సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని, దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు. పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు. సాధారణంగా సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/why-is-brinjal-avoided-during-a-strict-diet-34-230552.html




