ఇదేమి సరస్వతీ నిలయం? వీ.సీ, వసతుల కోసం గళమెత్తిన బాసర ట్రిపుల్ ఐటీ
Publish Date:Jun 15, 2022
Advertisement
వసతులు సరిగా లేకుండా విద్యార్ధలు ఎలా చదువుకుంటారు? క్లాస్‌రూమ్ పరిశుభ్రత, వెలుగు బాగా రావ డం, ఫర్నీచర్ సక్రమంగా వుండడం, పుస్తకాలు అందుబాటులో వుండడం ఎంతో అవసరం. మరీ ప్రొఫెష నల్ కాలేజీల్లో అయితే మంచి టీచింగ్ స్టాఫ్ తో పాటు అంతకుమించి మంచి లైబ్రరీ కూడా ఎంతో అవసరం. క్లాసుల్లో పాఠాలు వినేవారికి లైబ్రరీ కూడా ఎంతో అవసరం ఉంటుంది. పేరుకి వుందన్న చందంగా కాకుండా నిజంగానే మంచి వసతులు, పుస్తకాలు అందుబాటులో వుంటేనే దాని ప్రతిష్ట పెరుగుతుంది. అంతేగాని పేరు గొప్పవూరు దిబ్బలా వుంటే ఏదో ఒకరోజు విద్యార్ధులు ఎదురుతిరిగి అధకారులను, ప్రభు త్వా న్ని నిలదీస్తారనేదానికి వుదాహరణే ఇపుడు బాసర ఐఐటి సంస్థలో తలెత్తిన విద్యార్ధుల అసంతృప్తి వెల్లువ. అసలు తమ విద్యాసంస్థకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టు రెండేళ్లుగా భర్తీకాకపోవడం, అలాగే బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడం మరింతగా విద్యార్ధులను ఇబ్బంది పెడుతోంది. లక్షలాది రూపా యల ఫీజులు కట్టి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత స్థాయికి వెళ్లాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్ధుల భవిష్యత్తును తెలంగాణా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోందన్న వాదనా బలంగా వినపడు తోంది. ఐసిటి ఆధారిత విద్యా బోధన లేదని, పియుసి బ్లాక్ పునరుద్ధరించడం లేదన్నవి, హాస్టళ్లలో మెరుగయిన వసతులు కల్పించాలని వారి ప్రధాన డిమాండ్లలో వున్నాయి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేశారు. 12 డిమాండ్లను కచ్చితంగా నెరవేర్చాలని నిరసన తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యా ర్థులు నిరసనకు దిగారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పట్టిం చుకునే వారే లేరని విద్యార్థులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ న్యాక్ హోదాలో వెనక బడిపోయిందంటున్నారు. అయితే నిరసనకు దిగిన విద్యార్థులు.. టిఫిన్, మధ్యా హ్న భోజనం బహిష్క రించి.. కూర్చున్నారు. ఈ నిరాహార దీక్షలో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్టుగా తెలు స్తోంది. విద్యార్ధులకు మద్దతుగా బిజెపీ నాయకులు కూడా ఆందోళనలో పాల్గాన్నారు. వారి ప్రధాన డిమాండ్లను తెలంగాణా ప్రభుత్వం ఇకనయినా పట్టించుకుని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నా కు దిగారు. పరిస్థితులు అదుపుతప్పనున్నాయని పోలీసులు వారిని అరెస్టు చేశారు. విద్యార్ధుల సమస్య లు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి వెనుకాడమని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలు మూరి వెంకట్ నిరసన చేశారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్నారు. తన మంత్రిత్వశాఖ అధికారులతో చర్చించి ఈ వ్యవహారానికి సం బంధించి వీసీపై చర్యలుతీసుకుంటామని సబిత అన్నారు. ఘటనకు బాధ్యులయిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు బాసరలో కుట్రలకు పూనుకున్నాయ న్నారు. అసలు బాసర సంస్థలో విద్యార్ధులను అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలే రెచ్చగొట్టారని ఆమె ఆరోపిం చారు. కాగా, విద్యార్ధులు ఎలాంటి ఆందోళనా పడవలసిన అవసరం లేదని, వారి సమస్యలను వీలు వెం టనే పరిష్కరించగలమని తెలంగాణా అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సంస్థలో సౌకర్యాలు, ఇతర అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి తీసికెళతామని మంత్రి అన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
ఇదిలావుండగా, బుధవారం బాసర ఐఐటీ వద్ద ఏర్పడిన పరిస్థితులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసేరు.
http://www.teluguone.com/news/content/facilities-nill-in-basara--triple-it-25-137715.html





