కరోనా ఫోర్త్ వేవ్ తలుపులు తడుతోంది తస్మాత్ జాగ్రత్త
Publish Date:Jun 15, 2022
Advertisement
పోయింది .. ఇక రాదు .. అనుకున్న కరోనా మహమ్మారి మళ్ళీ, వస్తోంది. రాదనుకున ఫోర్త్ వేవ్ తలుపులు తడుతోంది. ఇది ఎక్కడో .. ఇంకో దేశంలోనో .. మరో రాష్ట్రంలోనో కాదు. మన దేశంలోనే, మన తెలంగాణలోనే .. అవును.. ఇంత కాలం.. భయం లేదు. కరోనా ఫోర్త్ వేవ్ రాదు అనుకున్నా.. కరోన మహమ్మారి దేశంలోనే కాదు తెలంగాణలోనూ మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇంత వరకు కరోనా భయం వద్దు, కరోనా కంటే సీజనల్ జ్వరాల గురించే మనంఎక్కువ జాగ్రతలు తీసుకోవాలని, చెపుతూ వచ్చిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, కాస్త ఆలస్యంగానే అయినా కళ్ళు తెరిచింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారిందని, జాగ్రత్తలు తపవని హెచ్చరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 219 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. తాజాగా ఒక్క హైదరాబాద్ లోనే 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఏపీలోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజు వారీ యాక్టివ్ కేసుల సంఖ్య 20 దాటింది. ఈ పెరుగుదల నాలుగోవ దశ కు సంకేతంగా భావించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరో వంక సరిహద్దు రాష్ట్రం మహా రాష్ట్రలో పెరుతున్న కేసులు, సంభవిస్తున్న మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 2956 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగిన ఇన్ఫ్లూయెంజా బాధితులకు వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు శ్వాస సమస్యలు, ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. శ్వాస కోస సంబందిత ఆరోగ్య సమస్యలు ఉన్న వారి నమూనాలను సేకరించి ఆర్టీపీసీఆర్ విధానంలో నిర్ధారించాలని పబ్లికెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులకు ఈ లక్షణాలతో ఓపీకి వస్తే వెంటనే కొవిడ్ టెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.అలాగే, క్షేత్ర స్థాయిలో ‘ఆశా’ కార్యకర్తలు ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ పరిక్షలు నిర్వహించాలని, క్వారంటైన్ చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చే మెడిసిన్ కిట్లను ఇవ్వాలన్నారు. అంతేగాక వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలన్నారు.దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని డీహెచ్ అన్నారు. మరో వంక దేశంలో కూడా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతుండటం టెన్షన్‌కు గురిచేస్తోంది. తెలంగాణ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 24 గంటల్లో 2956 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18267కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. తాజాగా 1118 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్యక.. 3177కు చేరుకుంది. ఈ నేపధ్యంలోనే తెలంగాన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
నిజానికి, చాల కాలంగా శాస్త్రవేత్తలు ఫోర్త్ వేవ్ గురించి హెచ్చరిస్తూనే ఉన్నా, ప్రభుత్వాలు, ప్రజలు కూడా అంతగా పట్టించుకోలేదు. అంతే కాకుండా, ఇతవరకు అక్కడక్కడ కేసులు నమోదవుతున్నా, ఆసుపత్రి చేరికలు అంతగా లేవు. మరణాలు అయితే, అసలే లేవు. దీంతో ఉపేక్ష పెరిగింది. వస్తే వస్తుంది. వచ్చినట్లే పోతుంది అనే ధీమా బలపడింది. అయితే ఇప్పుడు తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగతున్న వార్తలొస్తున్న నేపధ్యంలో , తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
http://www.teluguone.com/news/content/beware-of-corona-fourth-wave-25-137712.html





