చంద్రబాబుకి చెడ్డపేరు తెస్తున్న టెక్నికల్ టీమ్

Publish Date:Nov 3, 2015

Advertisement

 

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ వాడుకోవడంలో గానీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా, డిజిటల్ ఇండియా నినాదం ఇప్పుడు వచ్చింది గానీ నైన్టీస్ లోనే ఐటీకి పెద్దపీట వేశారు చంద్రబాబు, పదేళ్ల క్రితమే హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు... పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు, టెక్నాలజీని ఏ అవసరానికి ఎలా వాడుకోవాలో, ప్రతి పనినీ కచ్చితత్వంతో, పారదర్శకంగా ఎలా చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్ ను అమలుచేసి దేశంలో సంచనలం సృష్టించిన‌ చంద్రబాబునాయుడు... ల్యాండ్ రికార్డ్స్ ను డిజిటలైజ్ చేయడంతోపాటు ఈసేవతో పౌరసేవలను మరింత సులువు చేశారు, డిజిటల్ ఇండియా కంటే ముందే ఏపీలో డిజిటల్ విప్లవం సృష్టించిన చంద్రబాబు... పరిపాలనను ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు.

ఎంతో దూరదృష్టి కలిగిన నాయకుడైన చంద్రబాబు... మొదట్నుంచీ టెక్నాలజీకి పెద్దపీట వేశారు, డిజిటల్ విప్లవం అంటే తెలియని రోజుల్లోనే టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో ప్రతిభ చూపారు, అందుకే ఆనాడు దేశంలోనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు, ఇప్పుడు దాదాపు పదేళ్ల విరామం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... అదే రీతిలో మంచి విజన్ తో ముందుకెళ్తున్నారు. అయితే ఆనాడు మంచి టీమ్ తో సూపర్ సక్సెస్ సాధించిన చంద్రబాబు... ఈనాడు సరైన టీమ్ ను ఎంచుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు, దానికి రేషన్ షాపుల్లో ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానమే రుజువంటున్నారు విశ్లేషకులు, ఈపాస్ సిస్టం అద్భుతమైనదే... కానీ అమలులో మాత్రం ఫెయిల్ అయ్యిందంటున్నారు.

ఈపాస్ పథకం మంచిదే, అద్భుతమైనదే, ఐడియా కూడా గొప్పదే, కానీ అమలు తీరే సరిగా లేదు, రేషన్ షాపుల్లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంలో లబ్దిదారుల వివరాలను, వేలిముద్రను సర్వర్ తో కనెక్ట్ చేశారు, దాంతో రేషన్ కోసం వచ్చే లబ్దిదారుడి వేలిముద్ర... సర్వర్ తో టాలీ అయితేనే డీలర్లు సరుకు ఇస్తారు, సర్వర్ పనిచేయకపోయినా, వేలిముద్ర టాలీ కాకపోయినా సరుకు ఇవ్వలేని పరిస్థితి, దాంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గంటల తరబడి క్యూలో నిలబడినా... సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు, ఒక్కోసారి రెండు మూడ్రోజులు సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో తిరిగితిరిగి విసుగొచ్చి లబ్దిదారులు రేషన్ తీసుకోవడం మానేస్తున్నారు. దాంతో రేషన్ సరుకులు పెద్దఎత్తున మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి 50శాతం స్టాక్ మిగిలిపోతుండగా, ప్రతి నెలా సుమారు 20శాతం సరుకు తిరిగి ప్రభుత్వానికి తిరిగి వెళ్తోందని డీలర్లు అంటున్నారు. అయితే దీన్ని ఆదాగా ప్రభుత్వానికి అధికారులు చూపుతున్నారని, కానీ నిజం కాదని... సర్వర్ తో జనం విసిగిపోయి సరుకు తీసుకోకపోవడంతోనే స్టాక్ మిగిలిపోతుందని, దాంతో జనం కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని డీలర్లు చెబుతున్నారు.

ఈపాస్ విధానం అద్భుతమైనదే అయినా... సర్వర్లు సరిగా పనిచేయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం... టెక్నికల్ సపోర్ట్ సర్వీస్ లేకపోవడం... సమస్య వచ్చినప్పుడు పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని రేషన్ డీలర్లు అంటున్నారు, ఈపాస్ మిషన్లు, సర్వర్లు సరిగా పనిచేయడం లేదని ఎమ్మార్వోలకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారని డీలర్లు చెబుతున్నారు, ఈపాస్ మిషన్లు, సర్వర్లు సరిగా పనిచేస్తే తమకు మంచిదేనని, పని సులువు అవుతుందని... కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం చివరికి ప్రభుత్వంపైనే పడుతోందని అంటున్నారు,  సర్వర్ పనిచేయనప్పుడు కంప్లైంట్ చేసే విధానం గానీ, పరిష్కరించే టీమ్ గానీ లేదంటున్నారు. దాంతో ప్రజల సమయం కూడా వృథా అవుతోందని చెబుతున్నారు, రేషన్ సరుకులు కోసం జనం పడిగాపులు పడిపడీ... చివరికి విసిగిపోయి తీసుకోవడం మానేస్తున్నారని, అసలు సర్వర్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో... ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు.

పార్టీపరంగానూ ఐవీఆర్ఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిన చంద్రబాబు... ఈపాస్ అమలులో మాత్రం ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈపాస్ తో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం నిజమే అయినా... సర్వర్లు పనిచేయకపోవడంతో ఎందుకొచ్చిన ఈపాస్ అని జనం ఈసడించుకుంటున్నారు, పథకం ఉద్దేశం మంచిదే అయినా, అధికారులు దాన్ని సమర్ధంగా అమలు చేయలేకపోవడంతో ఆ ఎఫెక్ట్ చంద్రబాబుపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా పడుతోందంటున్నారు. అయితే టెక్నాలజీని వినియోగించుకోవడంలో మొనగాడైన చంద్రబాబు... ఈపాస్ విషయంలో మాత్రం సరైన టీమ్ ను ఎంచుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, కనీసం ఇప్పుడైనా అప్రమత్తం కావాల్సిన అవసరముందని, లేదంటే చెడ్డపేరు వచ్చే అవకాశముందని అంటున్నారు.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.