ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 169 పరుగులు.. ఫైనల్ కు చేరేనా?

Publish Date:Nov 10, 2022

Advertisement

ఇంగ్లాండ్ సెమీస్ గండం దాటి ఫైనల్ కు చేరాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేయాలి. అదే బిగ్ ఫైనల్ మ్యాచ్ చూడాలంటే మాత్రం భారత్ ఇంగ్లాండ్ ను  లక్ష్య ఛేదన చేయకుండా నిరోధించాలి. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ పరుగుల వరద పారించకుండా అడ్డుకుంది. కీ బౌలర్లు గాయాలతో అందుబాటులో లేకున్నా.. భారత్ ను నియంత్రించగలిగింది. కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మినహాయిస్తే రాహుల్, రోహిత్, పంత్, ఆఖరికి సూర్యకుమార్ యాదవ్ కూడా స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.

ముందు విరాట్ కోహ్లీ తన కింగ్ లైక్ ఇన్నింగ్స్ తో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ స్కోరులో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లు ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో రెండు చేతులా పరుగులను పిండుకుంటున్నాడు. సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై చెలరేగిన తరువాత వెనక్కు తిరిగి చూడటం లేదనే చెప్పాలి. ఫామ్ పై విమర్శలు చేసిన నోళ్లే ఇప్పడు పొగడ్తల వర్షం కురిపించేలా కోహ్లీ ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు.

ఇంగ్లాండ్ తో టి20 సెమీఫైనల్ మ్యాచ్ లో ఒక వైపు వికెట్లు టపటపా పడుతున్నా.. ఎక్కడా తగ్గకుండా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఒక వరల్డ్ రికార్డు కోహ్లీ ఖాతాలోకి వచ్చి చేరింది. టి20ల్లో నాలుగు వేల పరుగుల మైలు రాయిని దాటిన ఏకైక బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 50 పరుగులు చేసిన కోహ్లీ జోర్డాన్ బౌలింగ్ లో షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న రషిద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తరువాత హార్ధిక్ పాండ్యా పరుగుల ప్రభంజనం చూపాడు. ఎడాపెడా సిక్సర్లు బాది స్కోరును పరుగులెత్తించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయగలుగుతుందా అన్న దశ నుంచి చివరి ఓవర్ చివరి బంతికి ఔటయ్యే వరకూ హార్దిక్ పాండ్యా పరుగుల వదర పారించారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 190 స్ట్రైక్ రేట్ తో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్ చివరి బంతిని కూడా స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించినప్పటికీ.. స్టాన్స్ నియంత్రించుకోవడంలో విఫలమై హిట్ వికెట్ అయ్యాడు.

మొత్తం మీద ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా చాలెంజింగ్ టార్గెట్ నే ఇచ్చింది. బంతి కొద్దిగా ఎక్స్ ట్రా బౌన్స్ ఔతున్న పిచ్ పై భారత్ చేసిన స్కోరు మరీ తీసిపారేయాల్సింది కాదు. బౌలర్లు క్రమశిక్షణతో రాణిస్తే ఇంగ్లాండ్ కు ఈ టార్గెట్ ఛేజ్ చేయడం అంత సులువు కాదు. మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకూ సమాన విజయావకాశాలున్నాయని చెప్పాలి. చూద్దాం ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏం చేస్తారో? నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ గెలవాలంటే  ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 169 పరుగులు చేయలి.

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.