Publish Date:Dec 27, 2024
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది. దీనిపై కోర్టుకు వెళ్లిన కేటీఆర్ స్వల్ప ఊరటను పొందారు. అసలింకా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కానీ ఈ లోగానే ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దూకుడు పెంచింది.
ఈ కేసులో వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో ఈడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీయే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే వీరిరువురినీ కేటీఆర్ కంటే ముందుగానే అంటే జనవరి 2, 3 తేదీలలో విచారించనుంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రివెంటివ్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది. ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు అవినీతికి సంబంధించింది. అయితే ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అవినీతి జరగలేదని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. అయితే ఈడీ మాత్రం ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తరలించారంటూ కేసు పెట్టింది. ఏదో రూపంలో సొమ్ములు తరలించినట్లు కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఆ తరలింపుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడే ఈడీ రంగంలోకి దిగింది. అక్రమంగా సొమ్ములు తరలింపులో కేటీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఈడీ తేలుస్తానంటూ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కన్నా ఈడీ దూకుడుగా వ్యవహరించడం కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు ఆందోళన కలిగించే అంశమే. అసలు ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న తరువాత అనుమతి ఇవ్వడంతోనే ఏదో తప్పు జరిగిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ కు ఉచ్చు బిగిసిందన్న భావన రాజకీయ వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/enforcement-directorate-notices-to-ktr-25-190423.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.