Publish Date:Dec 28, 2024
ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలలో కూడా పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. మాయం అయిన బియ్యం విలువకు సమానంగా సొమ్ములు చెల్లిస్తామంటూ ఆయన న్యాయవాదులు చెప్పడంతోనే పేర్ని కుటుంబం బియ్యం మాయం చేసినట్లు అంగీకరించినట్లైందని అంటున్నారు.
అయితే ఇలా గోదాముల నుంచి బియ్యం మాయం ఒక్క పేర్ని కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోదాములు ఉన్న వైసీపీ నేతలు మరింత మంది కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బేతంచర్లలో ఉన్న గోదాం నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు రాగానే బుగ్గన స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే..ఆ గోడౌన్లలో కొన్ని తన బంధువులకు చెందినవి అయి ఉండొచ్చంటూ ముక్తాయించడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. తన బంధువుల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయమైతే తనకేం సంబంధం అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలతోనే బేతంచర్లలోని గోదాంలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎంతగా దబాయించాలని చూసినా.. బేతంచర్ల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయం అయ్యాయనీ, అది తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంలో బుగ్గన ఉన్నారనీ ఆయన మాటలను బట్టే అవగతమౌతోంది. బుగ్గన బంధువుల పేరు మీద గోడౌన్లు నడిచినా ఆయన సహకారం, మద్దతు లేకుండా బియ్యం మాయం చేయడం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు.
బేతంచర్ల గోదాముల వ్యవహారంలో విజిలెన్స్ దర్యాప్తు ఆరంభమైంది. మాయమైన బియ్యం లెక్కలు నేడో రేపో బయటకు రాకపోవు. ఈ భయంతోనే బుగ్గన మీడియా ముందుకు వచ్చి మరీ ఆ గోదాములతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారని అంటున్నారు. అలాగే వైసీపీకి అలవాటైన ఎదురుదాడికీ పాల్పడుతున్నారు. అదే సమయంలో బియ్యం మాయంతో తనకేం సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే బుగ్గనకూ అజ్ణాత వాసంలోకి వెళ్లక తప్పని పరిస్థితి త్వరలోనే ఎదురు కావచ్చునంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rice-trap-for-buffana-and-neck-25-190427.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.