Publish Date:Dec 27, 2024
కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కడపలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేడాయినిక కృత నిశ్చయంతో ఉంది. ఎవరైనా సరే చట్టాలను, నిబంధనలను గౌరవించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి రెడీ అని హెచ్చరికలు జారీ చేస్తోంది. కడప గడ్డపై నుంచే వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతామనీ, మెడలు వంచుతామని హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతోంది. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమౌతోంది. ఇందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుంబిగించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇక చట్టాన్ని అతిక్రమించే వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడానికి ఆయన కడప పర్యటనకు సమాయత్తమౌతున్నారు.
ఇంత కాలం ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమ దారికి తెచ్చుకునేవారు. వారు దారికి రాకుంటే ఫ్యాక్షనిస్టు మార్గాలలో కుటుంబాలను టార్గెట్ చేసుకుని బెదరింపులకు పాల్పడేవారు. దీంతో అధికారులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సేఫ్ గేమ్ ఆడేవారు. దీంతో ఇంత కాలం కడపలో వైసీపీ రాజ్యాంగమే నడుస్తూ వచ్చింది. వైసీపీ రాజ్యాంగమంటే రాజారెడ్డి రాజ్యాంగమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై ఇలాంటి పోకడలు సహించేది లేదన్న సంకేతాన్ని కూటమి ప్రభుత్వం గాలివీడు ఎంపీడీవోపై దాడి సంఘటన తరువాత ఆ దాడికి పాల్పడిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కుని పోవడం ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఇక వైసీపీయుల అరాచకాలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేసింది.
అధికారులు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా తమ పని తాము చేస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చాటడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీయుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులకు నైతిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి అధికారులు, ప్రజలలలో ధైర్యాన్ని నింపడానికి సమాయత్తమౌతున్నారు. ఇప్పటకే జిల్లా జనం, వైసీపీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. ఆ విషయం ఇటీవల క జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. సొంత పార్టీ క్యాడరే అధినేత జగన్ పట్ల అసంతృప్తి, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. జగన్ వ్యవహార శైలి పట్ల తమ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కడప గడ్డపై నుంచి వైసీపీ అరాచకాలను సహించేది లేదని చాటేందుకు రెడీ అవడంతో ఇక వైసీపీయులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-loosing-grip-in-kadapa-25-190421.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.