బీజేపీకి జగన్ బీ-టీమ్... షర్మిల ఫైర్

Publish Date:Feb 14, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో సాగుతున్న 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ పేరుకే ప్రతిపక్షమని, వాస్తవానికి అది బీజేపీ కూటమిలో అంతర్భాగమని సంచలన వ్యాఖ్యలు చేశారు. "బీజేపీతో టీడీపీ, జనసేనది సక్రమ సంబంధమైతే.. వైసీపీది అక్రమ సంబంధం" అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే జగన్‌కు తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే మతతత్వ బీజేపీకి వైసీపీ 'బీ-టీమ్'లా మారిందని విమర్శించారు.

*​రాష్ట్ర ప్రజలకు ద్రోహం..

​రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవుల ఓట్లతో గెలిచిన జగన్, ఢిల్లీకి వెళ్ళగానే మతతత్వ బీజేపీకి దాసోహం అవుతున్నారని షర్మిల మండిపడ్డారు. "వైఎస్సార్ కొడుకునని చెప్పుకునే జగన్, అదే వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటు" అని ధ్వజమెత్తారు. తనపై ఉన్న అవినీతి కేసులు, అక్రమ ఆస్తుల వ్యవహారం నుంచి తప్పించుకోవడానికే జగన్ మోదీ ముందు సాగిలపడ్డారని ఘాటుగా విమర్శించారు. అందుకే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నా జగన్ నోరు మెదపడం లేదని ఆరోపించారు.

*​గాంధీని చంపిన గాడ్సే వారసులే వీరు..

​నాడు గాడ్సే గాంధీని భౌతికంగా హతమార్చితే, నేడు మోదీ పథకానికి గాంధీ పేరు తొలగించి మళ్ళీ చంపారని, జగన్ దీనికి మౌనంగా సహకరిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రాష్ట్రంపై రూ. 5 వేల కోట్ల భారం పడే విబిజి రామ్ జి  చట్టానికి జగన్ మద్దతు తెలపడం పేదల పొట్ట కొట్టడమేనని అన్నారు. "మత రాజకీయాలతో దేశాన్ని విభజిస్తున్న బీజేపీకి మద్దతిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది" అని హెచ్చరించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా, విభజన హామీలు అమలు కాకపోయినా జగన్, చంద్రబాబులిద్దరూ మోదీ కాళ్ళ దగ్గర పడి ఉన్నారని ఆమె విమర్శించారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ, లేని పక్షంలో సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం సహకరించదని బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.