ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులపై వేటు పడింది. సుమారు 100 మంది వైట్‌కాలర్ ఉద్యోగులపై ప్రభావం పడినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పట్లోనే సంకేతాలు ఇచ్చింది. అందులోభాగంగానే ఇప్పుడు తాజా లేఆఫ్‌లు చేపట్టింది.
ఇందులో భాగంగా అమెజాన్ గోదాముల్లో పనిని ఆటోమేషన్ చేసేందుకు రోబోలను డిజైన్ చేసే టీమ్‌పై వేటు పడింది. కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు తమ టీమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామని అమెజాన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఎంతమందిని తొలగించిందీ పేర్కొనకుండా లేఆఫ్‌లను ధ్రువీకరించింది. వేర్‌హౌస్‌లో కార్మికులకు సాయపడేందుకు రోబోటిక్ విభాగమైన బ్లూ జే.. గతేడాది అక్టోబర్‌లో రోబోలను ప్రదర్శించింది.
అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ ఏడాది జనవరిలో వీటి తయారీని నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలను ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం, ఖర్చుల తగ్గింపులో భాగంగా గతేడాది అక్టోబర్‌లో 14వేల మందిని, ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది కలిపి ఇప్పటికే 30 వేల మంది ఉద్యోగులను అమెజాన్ పక్కనపెట్టింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ecommerce-giant-amazon-36-215063.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.