అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరవకుంటే ఇరాన్ వంతెనలు, పవర్ ప్లాంట్లను బాంబులతో లేపేస్తాం, ఆ దేశానికి నరకం చూపిస్తామంటూ అగ్రదేశాధినేత ట్రంప్ సోషల్ మీడియా ద్వారా చేసిన హెచ్చరికకు.. ఇరాన్ అమెరికాకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.
ఇంతకీ ఆ పరాజయం ఏమిటంటే.. 1979లో ఇరాన్ విప్లవం తర్వాత టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విద్యార్థులు, మొత్తం 52 మంది అమెరికన్లను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించేందుకు అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 1980 ఏప్రిల్ 24న ఆపరేషన్ ఈగిల్ క్లా పేరుతో సైనిక చర్య చేపట్టారు. అత్యంత నిపుణులైన కమాండోలు, ఆధునిక హెలికాప్టర్లతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల వల్ల ఆ ఆపరేషన్ ఘోరంగా విఫలం కావడమే కాకుండా, పెను విషాదంగా కూడా మారింది.
అప్పట్లో ఇరాన్ ఎడారిలో ఊహించని రీతిలో చెలరేగిన ఇసుక తుపాను కారణంగా హెలికాప్టర్ల విజిబిలిటి దెబ్బతింది. దీంతో మిషన్‌ను రద్దు చేసుకున్న అమెరికా ఆ సందర్భంగా 8 మంది అమెరికా సైనికులను పోగొట్టుకుంది. సహచరుల మృతదేహాలను, కీలక పత్రాలను సైతం వదిలేసి అమెరికన్ సైనికులు పలాయనమంత్రం జపించారు.
ఆపరేషన్ ఈగిల్ క్లా వైఫల్యం అప్పట్లో అగ్రరాజ్యం పరువును నిలువునా తీసేసింది. ఇప్పుడు ఇరాన్ ట్రంప్ వాచాలతకు బదులుగా.. నాటి అమెరికా ఘోర పరాభవాన్ని గుర్తు చేస్తూ చేసిన పోస్టు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-mind-blowing-counter-to-trump-warning-36-216748.html
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.